ETV Bharat / state

5PM TOPNEWS: టాప్​న్యూస్ @ 5PM

ఇప్పటివరకున్న ప్రధానవార్తలు

5pm
5pm
author img

By

Published : Mar 24, 2022, 4:59 PM IST

  • పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలో పాలిసెట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్‌ రెండో వారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు..

  • కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

అన్ని రాష్ట్రాల మాదిరిగానే తెలంగాణ నుంచి రా రైస్‌ సేకరణ జరుగుతోందని కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్​ వెల్లడించారు. కేసీఆర్‌ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని ఆయన విమర్శించారు.

  • విచ్చేసిన లేటెస్ట్ విమానాలు..

హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవియేషన్‌ షో-2022 అట్టహాసంగా ప్రారంభమైంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, ఫిక్కీ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు బేగంపేట్ విమానాశ్రయంలో జరగనుంది.

  • ఇంటి ముందే డంపింగ్ యార్డ్..

మున్సిపాలిటీ అధికారులు ఈ మధ్య కాలంలో పన్ను వసూళ్ల కోసం కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు. ఇంటిపన్ను చెల్లించకపోతే నీటి సరఫరా నిలిపివేయడం, నోటీసులు ఇవ్వడం వంటివి చేస్తారు. కానీ జగిత్యాల పురపాలక సిబ్బంది చేసిన నిర్వాకం అందరినీ విస్తుపోయేలా చేసింది.

  • ఆమెకు 67.. అతడి వయసు 28..

జిల్లా కోర్టుకు నోటరీ కోసం వచ్చిన ఓ జంటను చూసి షాక్​ అయ్యారు అక్కడివారు. తాము సహజీనం చేస్తున్నామంటూ నోటరీ చేయించుకుంది ఆ జంట. ఇందులో వింత ఏముంది అంటారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్​. ఆ జంటలో అబ్బాయి వయసు 28 ఏళ్లు అయితే అతని భాగస్వామి వయసు 67 ఏళ్లు!

  • ప్రభుత్వ వేడుకల్లో అపశ్రుతి..

ఫుడ్​ పాయిజన్​తో 150 మందికిపైగా విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. బిహార్​ దివస్​ వేడుకల్లో బుధవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

  • స్కూల్​​ టాయిలెట్​లో 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి

పాఠశాల మూత్రశాలలోకి లాక్కెళ్లి 11 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన దుర్ఘటన మహారాష్ట్ర, పుణె నగరంలో జరిగింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

సీఎస్కే కెప్టెన్​గా తప్పుకున్న ధోనీ..

అంతా అనుకున్నట్టే జరిగింది. ఈ ఏడాది చెన్నై సూపర్​ కింగ్స్​ సారథిగా ధోనీ కొనసాగుతాడా? లేదా? అని కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. మరో రెండు రోజుల్లో ఐపీఎల్​ 15వ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో ధోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

హిట్​ వదలని 'విక్రమార్కుడు'

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన 'ఆర్​ఆర్​ఆర్'​ మార్చి 25న విడుదల కానుంది. ఈ మూవీ బాక్సాఫీస్​ను బద్దలకొట్టి రూ.3వేల కోట్లు సాధిస్తుందని సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

భారీగా పెరిగిన పేటీఎం షేర్

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు గురువారం సెషన్​లో ఫ్లాట్​గా ముగిశాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ స్వల్పంగా 89 పాయింట్లు కోల్పోయి 57 వేల 596 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ పాయింట్లు 23 పాయింట్లు తగ్గి.. 17 వేల 223 వద్ద సెషన్​ను ముగించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.