రాష్ట్రంలో కొత్తగా 593 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2,69,816కు పెరిగింది. కరోనాకు ముగ్గురు బలవ్వగా... ఇప్పటివరకు 1,458 మంది మృతి చెందారు. తాజాగా 1,058 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకూ 2,58,336 మంది ఆరోగ్యవంతులుగా కోలుకున్నారు. మరో నలుగురు మృతి చెందారు. మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,455కి చేరుకుంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 10,022 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో7,946 మంది బాధితులున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 119 కేసులు నమోదవగా, రంగారెడ్డి జిల్లాలో 61, మేడ్చల్ జిల్లాలో 55 కేసులు నమోదయ్యాయి.