ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు.. 41 మరణాలు - telangana corona cases latest update

రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కొత్తగా 5,559 కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇవాళ్టి నుంచి రోజూ సాయంత్రం 6 గంటలకు కరోనా బులిటెన్‌ విడుదల చేస్తామని డీహెచ్​ శ్రీనివాసరావు వెల్లడించారు.

corona cases
corona cases
author img

By

Published : May 7, 2021, 7:31 PM IST

రాష్ట్రంలో కొత్తగా 5,559 కరోనా కేసులు నిర్ధరణ అయ్యాయి. మరో 41 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ ​బారినుంచి మరో 8,061 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 71,308 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ మేరకు సాయంత్రం ఐదున్నర గంటల వరకు వివరాలను ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్లడించింది. ఇవాళ్టి నుంచి రోజూ సాయంత్రం 6 గంటలకు కరోనా బులిటెన్‌ విడుదల చేస్తామని డీహెచ్​ శ్రీనివాసరావు వెల్లడించారు.

జీహెచ్​ఎంసీ పరిధిలో కొత్తగా 984 కేసులు వెలుగు చూశాయి. రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్‌ జిల్లాలో 372, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో 296 కేసులు నమోదయ్యాయి. నల్గొండ జిల్లాలో 208, కరీంనగర్‌ 201, ఖమ్మంలో 200 మందికి వైరస్‌ నిర్ధరణ అయింది.

దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 81.9 ఉండగా.. రాష్ట్రంలో 84.81గా ఉంది. దేశంలో మరణాల రేటు 1.1 ఉండగా.. రాష్ట్రంలో 0.54గా ఉందని బులిటెన్​లో వివరించారు. రాష్ట్రంలో అన్ని రకాల పడకలు కలిపి 53,528 అందుబాటులో ఉన్నాయి. 28,170 పడకలు రోగులకు కేటాయించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 66 శాతం ఆక్సిజన్ పడకలపై రోగులు ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 73 శాతం ఐసీయూ పడకలు రోగులతో ఉన్నాయని డీహెచ్​ శ్రీనివాసరావు తెలిపారు.

ఇదీ చూడండి.. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.