57 New Courts in Telangana 2023 : రాష్ట్రంలో రోజురోజుకు నేరాలు పెరిగిపోతున్నాయి. కానీ ఈ కేసులను పరిష్కరించేందుకు మాత్రం సరిపడా కోర్టులు.. న్యాయసిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఫలితంగా ఏళ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ కేసులు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి. రాజీలు కుదుర్చుతూ పలు కేసులు పరిష్కరిస్తున్నా లక్షల్లో పెండింగ్ కేసులు ఇంకా మూలన పడే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. అందులో భాగంగా రాష్ట్రంలో నూతన కోర్టులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 57 నూతన కోర్టులను మంజూరు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు.. కోర్టుల ఏర్పాటే కాకుండా.. ఇప్పటి వరకు ఉన్న కోర్టులో.. రాబోయే కొత్త కోర్టుల్లో సిబ్బంది నియామకానికి త్వరలోనే ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొంది.
సామాన్యులకు సత్వర న్యాయం స్వప్నమేనా?
New Courts in Telangana 2023 : రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 57 కోర్టులను మంజూరు చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి, జూనియర్ సివిల్ జడ్జి, సీనియర్ సివిల్ జడ్జి కేడర్లలో ఈ కోర్టులను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి ఆర్.తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో పెరుగుతున్న కేసులను పరిగణనలోకి తీసుకుని కొత్త కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర సర్కార్ సానుకూలంగా స్పందించింది. వెంటనే.. సర్కార్ ఆర్థిక శాఖ ఆమోదంతో కొత్త కోర్టులను మంజూరు చేసింది. ఇందులో బాలలపై జరిగే నేరాల విచారణకు.. ప్రత్యేకంగా 10 కోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది. కొత్త కోర్టుల్లో సిబ్బంది నియామకానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
కోర్టుల ఆధునికీకరణతో ప్రజలకు సత్వర న్యాయం: జస్టిస్ ఎన్వీ రమణ
మరోవైపు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలానికి అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు మంజూరు కావటంపై భద్రాచలం పట్టణ బార్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. కోర్టును తీసుకువచ్చేందుకు కృషిచేసిన భద్రాచలం పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్, జిల్లా జడ్జి పాటిల్ వసంత్, న్యాయమూర్తులకు బార్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. అదనపు కోర్టుతో పెండింగ్ కేసులకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని స్థానికులు, న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
"2004 నుంచి జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు ఒక్కటే నడుస్తోంది. దీనిలో దాదాపుగా 3,000ల క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భద్రాచలం పట్టణానికి చెందిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ చేసిన కృషితో అదనంగా ఇంకో కోర్టు రావడం సంతోషంగా ఉంది. ఇది నిజంగా హర్షణీయం." - కోటా దేవదానం, భద్రాచలం బార్ అసోసియేషన్ అధ్యక్షులు
న్యాయవ్యవస్థకు 'డిజిటల్' సొబగులు.. పౌరులకు మరింత ఉపయోగం!
POCSO Courts in Telangana : గిరిజన జిల్లాలో తొలి పోక్సో కోర్టు