నిజాం కాలం నాటి హలీమ్ రుచులను హైదరాబాద్ ప్రజలకు అందించేందుకు మసాబ్ ట్యాంక్‌లోని త్రిబుల్ ఫైవ్ కేఫ్‌లో హలీమ్ సెంటర్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వర్ధమాన సినీ నటి మన్నారా చోప్రా పాల్గొన్ని సందడి చేశారు. ఆమెతో పాటు పలు పలువురు మోడల్స్ పాల్గొన్నారు. వారితో కలిసి మన్నారా.. హలీమ్ రుచులను ఆస్వాదించారు.
తొలిసారిగా హలీమ్ రుచులను ఆస్వాదించడం చాలా సంతోషంగా ఉందని మన్నారా పేర్కొన్నారు. నిజాం కాలం నాటి హలీమ్‌ను తయారు చేస్తున్నామని వెజ్, నాన్ వెజ్లలో ఈ రుచులను అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చదవండి: రంగుల హోలీ పండుగ విశిష్టత తెలుసుకుందామా.!