ETV Bharat / state

TSRTC: చలచల్లగా పర్యావరణహితంగా.. టీఎస్‌ఆర్టీసీ ఎలక్ట్రిక్​ ఏసీ బస్సులు - టీఎస్​ఆర్టీసీ నడపనున్న ఎలక్ట్రిక్​ బస్సులు

Electric Buses In TSRTC:టీఎస్​ఆర్టీసీలో ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. కాలుష్య నివారణతో పాటు ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కలిగించేందుకు.. ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తీసుకురాబోతుంది. తొలిసారిగా దూర ప్రాంతాలకు ఆర్టీసీ ఈవీ బస్సులను నడిపించనుంది. వచ్చే నెలలో కొన్ని బస్సులను రోడ్లపై పరుగులు పెట్టించేందుకు.. అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

TSRTC
TSRTC
author img

By

Published : Apr 18, 2023, 7:07 AM IST

టీఎస్‌ఆర్టీసీలో అందుబాటులోకి రానున్న.. 550 ఎలక్ట్రిక్​ ఏసీ బస్సులు

Electric Buses In TSRTC: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు.. పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని.. టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. వచ్చే నెలలోనే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని.. ఆర్టీసీ యాజమాన్యం కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్ కు 550 ఎలక్ట్రిక్ బస్సుల కోసం.. ఆర్టీసీ ఆర్డర్ ఇచ్చింది. అందులో 500 బస్సులను హైదరాబాద్‌ సిటీలో.. మరో 50 బస్సులు విజయవాడ మార్గంలో తిప్పాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ కంపెనీకి చెందిన బస్సులతో పాటు జీబీఎం, అశోక్​ లేలాండ్​ కంపెనీల నుంచి మరో 1000 ఎలక్ట్రిక్​ బస్సులను అందుబాటులోకి తీసుకు వస్తారు. అయితే వీటిని గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం.. విడతల వారీగా ఆయా సంస్థలు టీఎస్‌ఆర్టీసీకి బస్సులను అందజేస్తాయి.

Telangana RTC Electric Buses: హైదరాబాద్‌లోని బస్‌భవన్ ప్రాంగణంలో నమూనా ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు సజ్జనార్‌ పలు సూచనలు చేశారు. బస్సుల్లో ప్రయాణికులకు అవసరమయ్యే సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని.. ఒలెక్ట్రా గ్రీన్​టెక్​ లిమిటెడ్​ ప్రతినిధులకు సూచనలు చేశారు. పర్యావరణహిత ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.

ఎలక్ట్రిక్​ ఏసీ బస్సుల్లో సౌకర్యాలు: ఆర్టీసీ తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సులో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ప్రతి బస్సు 12 మీటర్ల పొడవు కలిగి.. 41 సీట్ల సామర్థ్యంతో ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్​ బస్సులకు ఒక్కసారి ఛార్జింగ్​ చేస్తే చాలు.. 325 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. బస్సులో ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సౌకర్యంతో పాటు.. రీడింగ్ ల్యాంప్‌లను ఏర్పాటు చేశారు. బస్సులో ప్రయాణించే ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. వెహికిల్​ ట్రాకింగ్​ సిస్టంతో ఉంది. వీటితో పాటు ప్రతి సీటు వద్ద పానిక్​ బటన్​ సదుపాయం ఉంటుంది.

Electric Buses In Telangana: ఇంకా ఆ బటన్​ను టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్‌ బ్యాకప్‌ ఉంటుందని అధికారులు తెలిపారు. బస్సుకు అడ్డంగా హెహికల్స్​ నిలిచి ఉంటే వెనుకకు వెళ్లడానికి వీలుగా రివర్స్​ పార్కింగ్​ అసిస్టెన్స్​ కెమెరాను కూడా అమర్చారు. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిపిస్తాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించి.. నివారించేందుకు బస్సుల్లో ఫైర్‌ డిటెక్షన్‌ సప్రెషన్‌ సిస్టంను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా.. పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టంను బస్సుల్లో ఏర్పాటు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.