50 KG Ganja Seized in Secunderabad Railway Station : రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. డ్రగ్స్ మాట అనేది వినిపించకూడదన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. పక్క రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాల సరఫరాపై డేగ కళ్లతో మాటు వేసి, పక్కా సమాచారంతో నిందితులను పట్టుకుంటున్నారు.
ఆరు బస్సుల్లో 30 కేజీల గంజాయి తరలింపు - అబ్దుల్లాపూర్మెట్ వద్ద 10 మంది అరెస్ట్
Seized in Hyderabad : ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయించేందుకు వచ్చిన నిందితులను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆవరణలో పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.13 లక్షల విలువైన యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అరకుకు చెందిన జోగి నాయుడు, పంగి కిరోమని, లావణ్యలు తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి, నగరంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఎక్సైజ్ పోలీసులకు అందింది.
టమాటా ట్రేలలో రూ.80లక్షల గంజాయి - గుట్టురట్టు చేసిన పోలీసులు
దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో మాటు వేసిన పోలీసులు తనిఖీలు చేపట్టి నిందితులను పట్టుకున్నారు. ఒడిశాలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి లోకమాన్య తిలక్ రైల్లో గత కొంతకాలంగా ఈ వ్యాపారం కొనసాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పవన్ కుమార్ తెలిపారు.
"ఒడిశా నుంచి గంజాయి తీసుకువచ్చి నగరంలో విక్రయించేందుకు వచ్చిన నిందితులను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆవరణలో పట్టుకున్నాం. నిందితుల నుంచి రూ.13 లక్షల విలువైన యాభై కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. అరకుకు చెందిన జోగి నాయుడు, పంగి కిరోమని, లావణ్యలు తక్కువ ధరకే గంజాయిని కొనుగోలు చేసి నగరంలో ఎక్కువ ధరకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో తనిఖీలు చేసి పట్టుకున్నాం". - పవన్ కుమార్, హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్
చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన - ఆరా తీస్తే గంజాయి ముఠా గుట్టురట్టు