కారు ఆగి ఉన్నప్పుడైన, రన్నింగ్ కారులోనైన మంటలు రావడానికి ముఖ్యమైన 5 కారణాల గురించి చెబుతున్నారు హైదరాబాద్ ఎల్బీనగర్లోని మల్టీ కార్ రిపేర్ సెంటర్కు చెందిన ఎస్ఏ రాజు.
- కారుని టైం ప్రకారం సర్వీసింగ్ చేయకపోవడం, ఆయిల్ మార్చకపోవడం వల్ల ఆయిల్ చిక్కబడి ఉష్ణోగ్రత పెరిగి కారులో మంటలు వచ్చే అవకాశం ఉంది.
- ఉన్నదానికంటే.. హై వోల్టేజ్ వాడటం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
- కారులో ఓ పద్ధతి ప్రకారం వైరింగ్ చేయకపోవడం వలన కూడా ప్రమాదం సంభవించవచ్చు.
- కారులో పెట్రోల్ లేదా డీజిల్ ట్యాంక్లో కనీసం 1/4 ఇంధనం ఉండేట్లు చూసుకోవాలి.
- గుర్తింపు లేని సీఎన్జీ, ఎల్పీజీ కనెక్షన్ వల్ల కూడా మంటలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.