రాష్ట్రంలో కొత్తగా 417 కరోనా కేసులు, 2 మరణాలు నమోదయ్యాయి. ఇవాళ ఉదయం వరకు నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 2,88,410కు చేరింది. వైరస్‌తో మొత్తం 1,556 మంది మరణించారు.
కొత్తగా కోలుకున్న 472 మందితో కలిపి 2,81,872 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,982 యాక్టివ్ కేసులు ఉండగా... 2,748 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 82 కొవిడ్ కేసులు వచ్చినట్టు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.