3rd Vande Bharat Train in Telangana : రాష్ట్రం నుంచి మరో వందే భారత్ రైలు పట్టాలెక్కనుంది. రెండు ఐటీ నగరాల మధ్య ఈ రైలు కూతపెట్టనుంది. హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ వరకు నడిపేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం కాచిగూడ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని డోన్ రైల్వేస్టేషన్ వరకు సన్నహాక పరీక్ష నిర్వహించారు. ట్రాక్ సామర్ధ్యం, రైలు వేగం, సాంకేతికతపై రైల్వే అధికారులతో కలిసి హైదరాబాద్ డీఆర్‌ఎం లోకేశ్ వైష్ణోయీ వందేభారత్‌లో ప్రయాణించి ప్రత్యక్షంగా పరిశీలించారు.
3rd Vande Bharat Train Route Details in Telangana : ఉదయం కాచిగూడ నుంచి బయలుదేరిన ఈ రైలు నిర్ణిత సమయానికి ఒక గంట 10 నిమిషాల్లో మహబూబ్‌నగర్‌కు చేరుకుంది. ఒక్క నిమిషం అనంతరం డోన్‌కు పయనమైంది. ప్రస్తుతం కొనసాగుతున్న రెండు వందే భారత్ రైళ్లు అంచనాలకు మించి ఆదరణ లంభిస్తుండగా.. ఇప్పుడు రెండు ఐటీ నగరాల మధ్య మరో వందే భారత్ రైలును పరుగులు పెట్టించనున్నారు. హైదరాబాద్- బెంగళూరు మధ్య ఇప్పటికే సుమారు ఏడు రైళ్లు నడుస్తున్నాయి. రైల్వే ప్రయాణానికి ప్రస్తుతం 11 నంచి 12 గంటల వరకు సమయం పడుతోంది.
KCG to YPR Vande Bharat Train Stops in AP and TS : నిత్యం ఈ రైళ్లు రద్ది ఉంటుండటంతో.. డిమాండ్‌కు అనుగుణంగా వందే భారత్ ఏర్పాటు చేయటం ద్వారా ఆదరణ లభిస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వందే భారత్(Vande Bharat) అందుబాటులోకి వస్తే 7 గంటల్లోనే గమ్యస్థానం చేరుకొనే అవకాశం ఉంది. కాచిగూడలో ప్రారంభమై మహబూబ్ నగర్, కర్నూలు, డోన్ మీదుగా యశ్వంత్‌పూర్ చేరుకొనేలా ప్రాథమికంగా షెడ్యూల్‌ను ఖరారు చేశారు. సన్నహాక పరీక్ష విజయవంతంమైతే ఈ నెల 14 లేదా 15న ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.
వందే భారత్ రైలు.. సౌకర్యాలు ఎలా ఉంటాయో చూద్దామా..!
Vande Bharat Trains in Tealangana : 2023 జనవరి 15 తేదిన రాష్ట్రంలో మొదటి వందే భారత్ రైలును ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు వెళ్తోంది. ఈ రైలు 8 గంటల 30 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. తెలంగాణలో రెండో వందే భారత్ రైలును ప్రధాని మోదీ 2023 ఏప్రిల్ 8న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్రారంభించారు. ఈ రైలు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి మధ్య పరుగులు తీస్తోంది. ఈ రైలు వల్ల ప్రయాణికులు 8 గంటల 30 నిమిషాల్లోనే గమ్యస్థానాన్ని చేరుకుంటున్నారు. దేశంలో తొలి వందే భారత్ రైలు(Vande Bharat First Train)ను 2019 ఫిబ్రవరి 15న దిల్లీ నుంచి వారణాసి మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలుకి 'ట్రైన్-18'గా పేరు పెట్టారు. ఇది 762 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తున్నది.
తొలిసారి విశాఖ చేరుకున్న ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’.. విశేషాలివే..
కూతపెట్టిన సికింద్రాబాద్- తిరుమల వందేభారత్ రైలు.. జెండా ఊపి ప్రారంభించిన మోదీ
Vande Bharat Express : నేడే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవం