ETV Bharat / state

Talasani: ఈనెల 26న లబ్దిదారులకు 330 డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు - sanath nagar news

హైదరాబాద్ సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని అంబేద్కర్​నగర్​లో 330 డబుల్ బెడ్​రూమ్ ఇళ్లను ఈనెల 26న లబ్దిదారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ (Ktr) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

330 double bedroom houses
డబుల్ బెడ్​రూమ్ ఇళ్లు
author img

By

Published : Jun 17, 2021, 3:23 PM IST

ఈనెల 26న సనత్​నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్​పేట డివిజన్ అంబేద్కర్​నగర్​లో రూ.28 కోట్ల వ్యయంతో నిర్మించిన 330 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Ktr)​ చేతుల మీదుగా ప్రారంభించి లబ్దిదారులకు అందజేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas yadav)తెలిపారు. నెక్లెస్ రోడ్ (PV మార్గ్)లోని అంబేద్కర్ నగర్​లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొంటారని వివరించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm kcr) పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని తలసాని అన్నారు. మంత్రి వెంట పలువురు అధికారులు ఉన్నారు.

ఇదీ చూడండి: HCA issue: అజహరుద్దీన్- అపెక్స్ కౌన్సిల్ మధ్య రగడ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.