ETV Bharat / state

విభజన హామీలను ఏం చేశారు..?.. జోనల్ కౌన్సిల్ సమావేశంలో ప్రశ్నించనున్న తెలంగాణ - చెన్నై వేదికగా దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశం

Southern Zonal Council meeting : దక్షిణాది జోనల్ కౌన్సిల్ తదుపరి సమావేశం ఎజెండా ఖరారు కోసం రేపు స్థాయీ సంఘం చెన్నై వేదికగా సమావేశం కానుంది. ఈ భేటీలో అంతర్ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీజలాల కేటాయింపు కోసం చర్యలు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, తదితర అంశాలను జోనల్ కౌన్సిల్‌లో మరోమారు ప్రస్తావించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది.

Southern Zonal Council meeting
Southern Zonal Council meeting
author img

By

Published : Apr 4, 2023, 7:08 AM IST

Southern Zonal Council meeting : దక్షిణాది జోనల్ కౌన్సిల్ తదుపరి సమావేశం ఎజెండా ఖరారు కోసం ఈ నెల 5వ తేదీన స్థాయి సంఘం సమావేశం కానుంది. చెన్నై వేదికగా జరగనున్న ఈ భేటీలో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కు చెందిన అధికారులు, కేంద్ర హోంశాఖ అధికారులు సమావేశంలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఈ భేటీలో ప్రస్తావించాల్సిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతర్‌ రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నదీ జలాల కేటాయింపు కోసం చర్యలు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, నీటి పారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, తదితర అంశాలను జోనల్ కౌన్సిల్‌లో మరోమారు ప్రస్తావించేందుకు రాష్ట్ర సర్కార్ సిద్దమవుతోంది.

Southern Zonal Council meeting news : 2022 సెప్టెంబర్ మూడో తేదీన తిరువనంతపురంలో జరిగిన 30 వ జోనల్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు స్థితితో పాటు చెన్నై వేదికగా జరగనున్న తదుపరి కౌన్సిల్ సమావేశం ఎజెండాలో పొందుపరచాల్సిన అంశాలపై స్థాయి సంఘం సమావేశంలో చర్చిస్తారు. జోనల్ కౌన్సిల్ సమావేశం కోసం కేంద్ర ప్రభుత్వం లోని వివిధ శాఖలతో పాటు ఆయా రాష్ట్రాలు ఇప్పటికే 48 అంశాలను ప్రతిపాదించాయి.

విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 4000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, అంతర్ రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం నదీజలాల వాటా కోసం సిఫారసు, కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, కృష్ణా నదిపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టుల అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. పొరుగు రాష్ట్రాలు ప్రతిపాదించిన వాటిలోనూ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు ఉన్నాయి. వాటితో పాటు రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అంశాలను కూడా అధికారులు ప్రస్తావించే అవకాశం ఉంది.

ఇప్పటికే కాళేశ్వర లేదా పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే.. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు కింద చేర్చడానికి అర్హత లేదని కేంద్ర మంత్రి బిశ్వేశ్వర్ పార్లమెంటులో స్పష్టం చేశారు. జాతీయ హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం తేల్చి చెప్పినా.. మరోసారి ఈ అంశంపై జోనల్ సమావేశంలో ప్రస్తావించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేపు జరిగే భేటీలో ఈ అంశాన్ని ప్రస్తావనకు తీసుకురానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.