ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన 31 మంది విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేసి.. రిమాండ్‌కు తరలించారు. ప్రవేశ పరీక్షలు, ఇతర పరీక్షలు కరోనా తగ్గే వరకు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ సహా 31 మందిని అరెస్టు చేసి గోషా మహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని న్యాయమూర్తి వద్ద హాజరు పరచగా రెండు వారాలుపాటు రిమాండ్ విధించారు. వాళ్లని చంచల్ గూడ జైలుకి తరలించారు.
అరెస్టు అయిన విద్యార్థి నాయకులను కలిసేందుకు వెళ్లిన కాంగ్రెసన్ సీనియర్ నేత వీహెచ్‌ను అనుమతించలేదు. కొవిడ్ నిబంధనలు ప్రకారం నేతలను కలిసేందుకు.. అవకాశం లేదని జైలు అధికారులు స్పష్టం చేశారు. జైలు బయట వీడియో కాల్ ద్వారా వెంకట్‌ను వీహెచ్ పరామర్శించారు.