మహారాష్ట్రలోని అకోలా జిల్లా పాతూర్‌లోని క్వారంటైన్ శిబిరం నుంచి 30 మంది తెలుగు కూలీలు తప్పించుకున్నారు. వీరంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు. వారెవరికీ కరోనా లక్షణాలు లేవని జిల్లా కలెక్టర్ జితేంద్ర పాపల్కర్ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ ప్రకటించిన అనంతరం గత నెల 30న వారు స్వస్థలాలకు వెళ్తుండగా అధికారులు అడ్డగించి వారిని పాతూర్‌లోని మౌలానా ఆజాద్ సాంస్కృతిక భవన్‌లో ఉంచారు. అయితే వారు బుధవారం తెల్లవారుజాము నుంచి కనిపించడం లేదని, గాలింపు చర్యలు మొదలు పెట్టామని అధికారులు తెలిపారు.
ఇండోర్‌లో...
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని ఓ హోటల్‌ను క్వారంటైన్ కేంద్రంగా మార్చగా అక్కడి నుంచి ఏకంగా కొవిడ్-19 బాధితులే తప్పించుకుని వెళ్లిపోయారు. ఆరుగురు బాధితులు వెళ్లిపోగా.. అందులో ముగ్గుర్ని గుర్తించి ఆసుపత్రిలో చేర్పించామని అధికారులు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఐదుగురు కనిపించడం లేదని తెలిపారు. పంజాబ్‌లోని హోషియార్‌పుర్ ఆసుపత్రి నుంచి ఒకరు పరారు కాగా, పోలీసులు అతన్ని పట్టుకొని మళ్లీ క్వారంటైన్‌లో చేర్పించారు.
ఇదీ చూడండి: సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!