ETV Bharat / state

బల్దియాలో 30 డీఆర్సీ కేంద్రాల ఏర్పాటు... పకడ్బందీగా ఎన్నికలు

గ్రేటర్​లో 150 డివిజన్​లకు 30 డీఆర్సీ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల నుంచి పోలింగ్​కు సంబంధించిన బ్యాలెట్ బాక్సుల అందజేత, స్ట్రాంగ్ రూమ్​లు, లెక్కింపు కేంద్రాలు నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ జోన్​లో 5, చార్మినార్ జోన్​లో 6, ఖైరతాబాద్ జోన్​లో 5, సికింద్రాబాద్​ జోన్​లో 5, శేరిలింగంపల్లి జోన్​లో 4, కూకట్​పల్లి జోన్​లో 5 డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. డీఆర్సీ కేంద్రాలల్లో రేపు ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల సిబ్బందికి బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సామాగ్రి అందించనున్నారు.

బల్దియాలో 30 డీఆర్సీ కేంద్రాల ఏర్పాటు... పకడ్బందీగా ఎన్నికలు
బల్దియాలో 30 డీఆర్సీ కేంద్రాల ఏర్పాటు... పకడ్బందీగా ఎన్నికలు
author img

By

Published : Nov 29, 2020, 8:26 PM IST

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బ్యాలెట్ బాక్సుల అందజేత కార్యాక్రమం సోమవారం ప్రారంభం కానుంది. మొత్తం 150 డివిజన్​లకు సంబంధించి 30 డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో సోమవారం ఉదయం 8 గంటల నుంచి బ్యాలెట్ బాక్సుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది.

అధికారులకు పోలింగ్ సామగ్రి...

నాచారం రోడ్​లోని శ్రీచైతన్య స్కూల్, రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాల, హయత్​నగర్​లోని వర్డ్ అండ్ డీడ్ విద్యాసంస్థ, సరూర్​నగర్​లోని విక్టోరియా మెమోరియల్ హోం, సరూర్​నగర్​లోని ఇండోర్ స్టేడియం, అంబర్​పేట్​లోని ఇండోర్ స్టేడియం, బండ్లగూడలోని మహవీర్ ఇనిస్టిట్యూట్, బండ్లగూడలోని అరోరా అకాడమీ, హైకోర్టు రోడ్​లోని ప్రభుత్వ సిటీ కాలేజీ, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్​లోని కమలా నెహ్రూ పాలిటెక్నిక్​ కళాశాలలో డీఆర్సీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి సంబంధిత డివిజన్​లకు సంబంధించిన సామగ్రి అధికారులకు పంపిణీ చేయనున్నారు.

పకడ్బందీగా...

రాజేంద్రనగర్ వెటర్నరీ కళాశాల, మాసబ్ ట్యాంకులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ఎల్బీ స్టేడియం బాక్సింగ్ హాల్, నిజాం కళాశాల, సనత్​నగర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, బంజారాహిల్స్ సుల్తాన్ ఉలుం కళాశాల, దోమలగూడ ఏవీ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ జూబ్లీహాల్ కాన్ఫరెన్స్ హాల్, సైనిక్ పురిలోని భవన్స్ కళాశాల, ఉస్మానియా యూనివర్సిటీ కామర్స్ కళాశాల, బేగంపేట్ వెస్లీ కళాశాల, యూసుఫ్ గూడ స్టేడియం, గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం, మియాపూర్ సాంటియా గ్లోబ్ స్కూల్​లో, చందానగర్ పీజేఆర్ స్టేడియం, కూకట్​పల్లి జేఎన్​టీయూ కళాశాల, హైదర్​నగర్ రిషి కళాశాల, జీడిమెట్ల సుచిత్రా అకాడమీ, కుత్బుల్లాపూర్​లోని సెయింట్ ఆన్స్ స్కూల్, అల్వాల్​లోని లయోలా అకాడమీ సిబ్బందికి సామగ్రి అందించున్నారు.

ఈసారి ప్రత్యేకంగా కరోనా కిట్లు సిబ్బందికి అందించనున్నారు. 500 మి.లీల శానిటైజర్లను ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5 చొప్పున అందించేందుకు 60 వేల శానిటైజర్లు ఇప్పటికే బల్దియా సిద్ధం చేసింది.

ఇదీ చూడండి: బస్తీ పోరులో ఓటేయాలంటే ఈ నిబంధనలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.