ETV Bharat / state

బాటసారులను దోచుకుంటున్న ముగ్గురు నిందితులు అరెస్ట్

రహదారిపై వెళ్తున్న వారిని దోచుకుంటున్న ముగ్గురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని దిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి బోయిన్ పల్లి మార్కెట్ వైపు వెళ్తున్న క్రమంలో ద్విచక్రవాహనంపై దొంగతనాలకు పాల్పడి పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారు..

బాటసారులను దోచుకుంటున్న ముగ్గురు నిందితులు అరెస్ట్
బాటసారులను దోచుకుంటున్న ముగ్గురు నిందితులు అరెస్ట్
author img

By

Published : Jun 9, 2020, 4:32 PM IST

హైదరాబాద్ లో రహదారిపై వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు యువకులను కార్ఖానా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 2 చరవాణులు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మచ్చ బొల్లారానికి చెందిన తరుణ్, లోకేశ్, అలీగా గుర్తించారు. వీరిలో ఇద్దరు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా... ఒకరు విద్యార్థిగా తెలిపారు.

విధులు ముగించుకుని హాస్టల్ కు ద్విచక్రవాహనంపై వెళుతున్న ఓ వ్యక్తి దగ్గర నుంచి చరవాణి లాక్కున్నారు. దిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఈ ఘటన జరగ్గా…. నిందితులు బోయిన్ పల్లి మార్కెట్ వైపు పారిపోయారు. మార్గ మధ్యలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహించారు. ఈ 5అనికిల్లో భాగంగా ద్విచక్ర వాహనంపై ముగ్గురు నిందితులు వెళ్తుండగా పట్టుకున్నారు. ముగ్గుర్ని విచారించగా… అసలు విషయం బయటపడింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు .

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.