రంగారెడ్డి జిల్లా జల్పల్లి మున్సిపాలిటీలో ముంపునకు గురై వీధిన పడ్డ 1,786 కుటుంబాలకు అందరికీ ప్రభుత్వ సాయం కింద ఒక్కొక్క కుటుంబానికి రూ. 10 వేల చొప్పున రూ. 1,76,80,000 అధికారులు అందించారు. ఈ మేరకు పది నిజ నిర్ధారణ బృందాలను ఏర్పాటు చేసి... 7,800 కుటుంబాలను గుర్తించినట్టు మున్సిపల్ కమిషనర్ డా. ప్రవీణ్ కుమార్ తెలిపారు.
వరదల వల్ల నష్టపోయిన హైదరాబాద్ పునర్నిర్మాణం కోసం బుధవారం సీఎం సహాయనిధికి రూ. 3.17 కోట్ల విరాళాలు అందాయి. ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) తరపున రూ. 25 లక్షల చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందించారు. బల్క్‌డ్రగ్ అసోసియేషన్ ద్వారా వివిధ కంపెనీలు రూ. 1.32 కోట్ల చెక్కును అందించాయి. భాగ్యనగరాన్ని వీలైనంత త్వరగా అభివృద్ధి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ఇదీ చదవండిః తెలంగాణలో రాగల మూడురోజులు పొడి వాతావరణం