Kanti Velugu Programme 2nd Phase in Telangana : ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 96.21 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంధత్వ రహిత తెలంగాణ రహిత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకం కంటి వెలుగు. రాష్ట్ర ప్రజలు అందరూ కంటి పరీక్షలను చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహించింది. రాష్ట్రంలో కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో 2018 ఆగస్టు 15న మెదక్ జిల్లాలో సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
2nd Phase Kanti Velugu Programme : ఇందులో భాగంగా తొలి విడత 8 నెలల పాటు సాగింది. మొదటి విడతలో కోటిన్నర మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించింది. అందులో 50 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చింది. అవసరమైన వారికి మందులు పంపిణి చేశారు. దీంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చినందున.. రెండో విడత కార్యక్రమాన్ని 2023 జనవరి 18న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెండో విడత 100 రోజులు పాటు కొనసాగుతోంది.
'కంటి వెలుగు' ఇక శాశ్వతం.. నిరంతరం నేత్ర వైద్యం అందించేలా చర్యలు
దృష్టి లోపం ఉన్నవారికి ఉచితంగా కళ్లద్దాలు : జూన్ 15 వరకు కంటి పరీక్షలు రాష్ట్ర ప్రజలందరికి పూర్తి చేయాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 96.21 శాతం లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,58,35,947 మందికి కంటి పరీక్షలు పూర్తి చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో దృష్టి లోపం ఉన్నవారిని గుర్తించి 22,21,494 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేసింది. వీటితో కావల్సిన మందులను పంపిణి చేశారు.
కంటి పరీక్షలు చేయించుకున్న వారిలో
- పురుషులు - 74,42,435
- స్త్రీలు - 83,73,097
- ట్రాన్స్ జెండర్‌లు - 10,955
- మొత్తం కంటి పరీక్షలు - 1,58,35,947
కంటి పరీక్షలు చేయించుకున్న 1,18,26,614 మందికి ఎలాంటి కంటి సమస్యలు లేవని నిర్ధారణ అయినట్టు పేర్కొంది. ఎక్కువ జిల్లాలో దగ్గర చూపు కనిపించక ఇబ్బింది పడిన వారే ఎక్కువగా ఉన్నారని ఆరోగ్య తెలిపింది. ఇందులో అధికంగా 40 ఏళ్ల పైబడిన వారే వైద్య శిబిరానికి వస్తున్నారని పేర్కొంది. అలాంటి వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ ఏ, డీ, బీ కాంప్లెక్స్ వైద్య సిబ్బంది సరఫరా చేస్తున్నారని తెలిపింది. 50 ఏళ్ల పైబడిన వారు ఎక్కువగా కంటి శుక్లాల సమస్యతో బాధపడుతున్నారని వైద్య సిబ్బంది గుర్తించారు.
ఇవీ చదవండి :