కొవిడ్ చికిత్సలో ఉపయోగించే 2-డీజీ ఔషధాన్ని దిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌తో కలిసి కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విడుదల చేశారు. నేటి నుంచి 2-డీయాక్సి-డీ గ్లూకోజ్ ఔషధం అందుబాటులోకి రానుంది. కొవిడ్ చికిత్స కోసం హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌తో కలిసి ఈ ఔషధాన్ని డీఆర్‌డీవో అభివృద్ధి చేసింది.
కొవిడ్ చికిత్సలో 2డీజీ అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. నీటిలో కలుపుకొని తాగేలా పౌడర్ రూపంలో 2డీజీ ఔషధం తయారు చేశారు. ఈ డ్రగ్‌తో ఆక్సిజన్‌పై చికిత్స పొందే సమయం తగ్గించొచ్చని డీఆర్‌డీవో తెలిపింది.
ఇదీ చదవండి: కొవిడ్ చికిత్సలో కొత్త మందు