భాజపా రాష్ట్ర కార్యాలయంలో మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, నల్లు ఇంద్రసేనారెడ్డి, పార్టీ శ్రేణులు గాంధీజీ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఎర్రకోట నుంచి స్వచ్ఛ భారత్ గురించి మోదీ మాట్లాడితే ప్రతిపక్షాలు ఎగతాళి చేశాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ దుయ్యబట్టారు. పల్లెలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని విశ్వసించిన వ్యక్తి గాంధీ అని కొనియాడారు. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 27 రాష్ట్రాలు, 601 జిల్లాలు ఓడీఎఫ్‌గా మారాయని వివరించారు.
ఇదీ చూడండి : ఆహార పదార్థాలు కలుషితమై 25 మందికి అస్వస్థత!