తెలంగాణ 5వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆల్ ఇండియా ఆర్ట్ కాంపిటీషన్, ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు. కార్యక్రమాన్ని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా దాదాపు 250 కళా ఖండాలను ఎంపిక చేసి ప్రదర్శనకు ఉంచారు. వాటిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం, కల్చరల్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పలువురు కళాకారులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న కళాఖండాలు
గ్యాలరీలో ప్రదర్శనకు ఉంచిన కళాఖండాలు చూపరులను మంత్రముగ్థుల్ని చేశాయి. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా కొన్ని చిత్రాలు అలరించాయి.
చదువుకుంటున్న రోజులు గుర్తొచ్చాయి
ఎగ్జిబిషన్లో కళాఖండాలను చూసి తాను చదువుకున్న రోజులు గుర్తొచ్చాయని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్ అన్నారు. దేశంలోని అత్యంత శక్తిమంతమైన నగరాల్లో హైదరాబాద్ ఒకటని పేర్కొన్నారు. జులై 9 వరకు ఈ ప్రదర్శన నగరవాసులకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఇదీ చూడండి : ధాన్యం కొనుగోలులో తెలంగాణ రికార్డు