ETV Bharat / state

covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు - covid cases

రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jun 3, 2021, 5:12 PM IST

Updated : Jun 3, 2021, 5:54 PM IST

17:09 June 03

covid cases: రాష్ట్రంలో కొత్తగా 2,261 కరోనా కేసులు

    రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇవాళ కొత్తగా 2,261 కరోనా కేసులు నమోదయ్యాయని, కొవిడ్​తో మరో 18 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. మహమ్మారి బారి నుంచి మరో 3,043 మంది బాధితులు కోలుకున్నారన్న ఆయన.. పాజిటివిటీ రేటు 2 శాతంగా ఉందన్నారు. సరిహద్దు జిల్లాల్లో కరోనా పరిస్థితులపై అధ్యయనం చేయాలని ఆయన అధికారులకు సూచించారు.  

   గ్రామాల్లోనూ పకడ్బందీగా లాక్‌డౌన్‌ అమలు కావాలని... దేశవ్యాప్తంగా గ్రామాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరిగిందని డీహెచ్​ పేర్కొన్నారు. గ్రామాల్లోనూ ఐసోలేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రజలకు కరోనాపై అధికారులతో అవగాహన కల్పిస్తున్నామని... కరోనా కేసులు తగ్గితే లాక్‌డౌన్‌ నుంచి వెసులుబాటు లభించే అవకాశం లభిస్తుందన్నారు.  రాష్ట్రంలో 55 వేలకు పైగా పడకలు అందుబాటులో ఉన్నాయన్న డీహెచ్​... ఆస్పత్రుల్లో 14 వేలకు పైగా పడకలు ఖాళీగా ఉన్నాయన్నారు.  7,018 ఐసీయూ పడకలు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.  

    రెండో విడతలో 87,49,549 ఇళ్లలో సర్వే పూర్తి చేశామని డీహెచ్​ వెల్లడించారు. సర్వేలో 4,037 మందికి కరోనా లక్షణాలున్నట్లు గుర్తించామన్నారు. కొన్నిచోట్ల మూడో దశ ఇంటింటి సర్వే చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. లక్షణాలు ఉన్న 3.5లక్షల మందిని ఫీవర్​ సర్వేలో గుర్తించామన్నారు. 114 ఆస్పత్రులపై ఫిర్యాదులు వచ్చాయన్న డీహెచ్​... వాటిపై విచారించి చర్యలు చేపడతామన్నారు.  

ఇదీ చదవండి: కొవిడ్​ వ్యాక్సిన్​ రెండో డోస్​ తీసుకున్న ఎంపీ రేవంత్​ రెడ్డి

Last Updated : Jun 3, 2021, 5:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.