ETV Bharat / state

కుత్బుల్లాపూర్​లో కరోనా కలకలం... 21 కేసులు నమోదు - హైదరాబాద్​లో కరోనా కేసులు

హైదరాబాద్​లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్​ కేసులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. కుత్బుల్లాపూర్​ నియోజకవర్గంలో కరోనా వైరస్​ కలకలం సృష్టించింది. ఒక్కరోజే ఏకంగా 21 మందికి పాజిటివ్​ అని తేలగా... స్థానికులంతా ఆందోళనకు గురవుతున్నారు.

21 positive cases in kutbullapur constituency

author img

By

Published : Jun 24, 2020, 5:10 PM IST

హైదరాబాద్​లో కరోనా కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో బుధవారం అత్యధికంగా 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. నిజాంపేట్​లోని వివిధ అపార్టుమెంట్లలో 4 కేసులు నమోదవగా... గాజులరామరం పరిధిలో ఇద్దరు మహిళలకు పాజిటివ్​గా నిర్ధారణ అయింది.

జీడీమెట్ల పరిధిలోని వివిధ కాలనీల్లో 5 కేసులు నమోదవగా... సుచిత్రలో ముగ్గురు కొవిడ్​ బారిన పడ్డారు. చింతల్​లో మరో ఇద్దరికి కరోనా సోకింది. ఇవే కాక.. నియోజకవర్గంలోని వివిధ కాలనీల్లో మరో 5 పాజిటివ్​ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి: పూర్తి వేతనాల చెల్లింపునకు సర్కారు ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.