ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా.. వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిష్కరించి కేంద్ర ఎన్నికల సంఘం.. ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,03,56,894 ఉన్నట్లు వెల్లడించింది. వీరిలో పురుష ఓటర్లు 1,52,56,474 కాగా.. మహిళా ఓటర్లు 1,50,98,685 మంది ఓటర్లు ఉన్నారని స్పష్టం చేసింది.
ఇతర ఓటర్లు 1,735 మంది ఉండగా.. 18-19 ఏళ్ల వయసు కలిగిన ఓటర్లు 1,36,496 మంది ఉన్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. 2021తో పోలిస్తే దాదాపు రెండు లక్షల ఓటర్లు పెరిగారని తెలిపింది. మొదటి సారి ఓటుహక్కు పొందనున్న వారికి ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డులను ఉచితంగా ఇళ్ల వద్దకే పంపించనుంది.
2022 ఓటర్ల జాబితా |
రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య | 3,03,56,894 |
పురుష ఓటర్లు | 1,52,56,474 |
మహిళా ఓటర్లు | 1,50,98,685 |
ఇతర ఓటర్లు | 1,735 |
18-19 ఏళ్ల మధ్య ఓటర్లు | 1,36,496 |
ఇదీ చూడండి: పెళ్లి పేరుతో వల.. యువతులకు రూ.లక్షల్లో టోకరా