ETV Bharat / state

2020 రౌండప్​: లాక్​డౌన్​.. వరదలు.. జలజగడాలు

రాష్ట్రానికి 2020 సంవత్సరం చేదు జ్ఞాపకాలనే మిగిల్చింది. కొవిడ్, దాని ప్రభావంతో అనివార్యమైన లాక్​డౌన్, తదనంతర పరిణామాలు ఇబ్బందులనే మిగిల్చాయి. రికార్డు స్థాయి కుంభవృష్టి హైదరాబాద్​ను అతలాకుతలం చేసింది. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వ్యవసాయానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వచ్చింది. కరోనా సమయంలోనూ రాష్ట్రానికి పారిశ్రామికంగా పెట్టుబడులు వరుస కట్టాయి. కొత్త రెవెన్యూ విధానం, రిజిస్ట్రేషన్ల నిలిపివేత ప్రభుత్వానికి కొంత ప్రతికూలంగా పరిణమించాయి. ఏపీలో జలవివాదం అపెక్స్​ కౌన్సిల్​ వరకూ వెళ్లింది. విపక్షాల విమర్శల మధ్య నూతన సచివాలయం నిర్మాణానికి ప్రభుత్వం ముందడుగు వేసింది.

2020 telangana roundup
2020 రౌండప్​: లాక్​డౌన్​.. వరదలు.. జలజగడాలు
author img

By

Published : Dec 27, 2020, 7:33 PM IST

పల్లెప్రగతి..

రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమం మంచి ఫలితాలనిచ్చింది. ప్రతినెలా నిధులు సమకూర్చడం సహా.. ప్రజాప్రతినిధులు, అధికారులపై జవాబుదారీతనాన్ని తీసుకువచ్చింది. వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయి.

కరోనా విజృంభణ.. లాక్​డౌన్​..

రాష్ట్రానికి రాబడి పెరిగి... బడ్జెట్​ కాస్త 1.82 వేలకోట్లకు చేరింది. బడ్జెట్​ సమావేశాలు జరుగుతుండగానే వెలుగు చూసిన కరోనా కేసులు పరిస్థితిని పూర్తిగా మార్చేశాయి. జనతాకర్ఫ్యూ రోజే పూర్తిస్థాయి లాక్​డౌన్​ను ప్రభుత్వం విధించింది. కరోనా ఉద్ధృతిని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి కేసీఆర్... నిత్యం సమీక్షలు, సమావేశాలతో ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. అయినా అనేక మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకొంది. ఇదే సమయంలో కొవిడ్ నిర్ధరణ పరీక్షలు తక్కువగా చేస్తున్నారంటూ.. ప్రభుత్వంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఉన్నతాధికారులే స్వయంగా న్యాయస్థానానికి హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

వేతనాల్లో కోత..

లాక్​డౌన్ విధింపుతో అన్ని కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. పేదలు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం పంపిణీ సహా ఆర్థికసాయం చేసింది. వలస కార్మికులకూ చేయూతనివ్వడం సహా ప్రత్యేక రైళ్ల ద్వారా వారిని స్వరాష్ట్రాలకు చేర్చింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం గణనీయంగా పడిపోవడం వల్ల ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కొంత మేర కోత విధించింది. ఆ తర్వాత వాటిని సర్దుబాటు చేసింది. వేతనాల, పింఛన్లలో కోత విధానం చట్టబద్ధతను న్యాయస్థానం ప్రశ్నించడం వల్ల తొలుత ఆర్డినెన్స్​ను తీసుకొచ్చారు. అనంతరం దానికి చట్టరూపం ఇచ్చారు.

రుణాలపైనా..

ఆదాయం భారీగా పడిపోవడం, అదనపు వ్యయం దృష్ట్యా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఎక్కువగా రుణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది ఇప్పటి వరకు దాదాపు రూ.30 వేల కోట్ల వరకు రుణాలు తీసుకొంది.

ఈ రంగాలకు పెద్దపీట..

ఆర్థికంగా అవస్థలు పడినా.. సంక్షేమం, వ్యవసాయరంగానికి నిధులకు కొరత రానివ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకొంది. కరోనా సమయంలో రైతులు ఇబ్బందులు రాకుండా కళ్లాల వద్దే పంటను కొనుగోలు చేసింది. రుణమాఫీలో భాగంగా 25 వేల లోపు రుణాలు ఉన్నవారికి నిధులు విడుదల చేసింది. వానాకాలం రైతుబంధు సాయం కోసం స్వల్పకాలంలోనే రూ.7,200 కోట్లను రైతుల ఖాతాల్లో జమచేసింది.

రైతువేదికలు..

రాష్ట్రవ్యాప్తంగా క్లస్టర్ల వారీగా రైతువేదికలు, కళ్లాల నిర్మాణాన్ని చేపట్టింది. కొన్ని చోట్ల రైతువేదికల నిర్మాణం కూడా పూర్తైంది. రాష్ట్రంలో సాగునీటి వసతి పెరగడం వల్ల పంటలసాగు పెరిగింది. ఫలితంగా రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. భారత ఆహార సంస్థకు పెద్దమొత్తంలో ధాన్యాన్ని తెలంగాణ సమకూర్చింది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగుచేయాలన్న ఆలోచనకు అనుగుణంగా నియంత్రిత సాగు విధానం ప్రారంభమైంది. వరి, పత్తి భారీగా పెరగింది. మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గింది. ఈ వానాకాలంలో రికార్డు స్థాయిలో కోటి నలభై లక్షల ఎకరాలకు పైగా పంటల సాగు జరిగింది. భారీ వర్షాల వల్ల పంట నష్టం.. సన్న వడ్ల కొనుగోళ్ల అంశం మొదట్లో కొంత ఇబ్బంది కరంగా మారింది.

నూతన సచివాలయం..

హైదరాబాద్​కు మణిహారంగా మాదాపూర్ దుర్గం చెరువుపై తీగల వంతెన అందుబాటులోకి వచ్చింది. భాగ్యనగర చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే మెజంజాహీ మార్కెట్ పునఃప్రారంభమైంది. సౌకర్యాల లేమి, భద్రతాపరమైన లోపాల పేరుతో నూతన సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం చేపట్టింది. విపక్షాల విమర్శల మధ్యే పాత సచివాలయాన్ని కూలగొట్టింది. అదే స్థలంలో కొత్త సెక్రటేరియట్​ను నిర్మిస్తోంది. ఏడంతస్థుల మేడలో సువిశాలంగా, అత్యాధునిక వసతులతో నూతన భవంతిని నిర్మిస్తున్నారు.

జలజగడం

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాలు, పంప్​హౌజ్​లు అందుబాటులోకి వచ్చాయి. ఉమ్మడి మెదక్ సహా పరిసర ప్రాంతాల్లో మరికొంత భూమికి సాగునీటి సౌకర్యం లభించింది. ఆంధ్రప్రదేశ్​తో జలవివాదాలు మళ్లీ మొదటికొచ్చాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతలపై ఇరు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చోటుచేసుకున్నాయి. అపెక్స్​ కౌన్సిల్​ వేదికగా జలజగడం సాగింది.

కుండపోత వర్షాలు..

అక్టోబర్​లో కురిసిన భారీ వర్షాలు ప్రజలు ఇబ్బందులు పెట్టాయి. ప్రత్యేకించి హైదరాబాద్​ నగరం సహా శివారు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. వందేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో కుండపోత వర్షం కురిసింది. వందల కాలనీలు, వేలాది ఇళ్లు నీటమునిగాయి. హైదరాబాద్​లో పడవల్లో తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. చాలా కాలనీలు వారం, పదిరోజులకు పైగా వరదనీటిలోనే ఉండాల్సి వచ్చింది. వరదల వల్ల నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం పదివేల రూపాయల చొప్పున నగదుసాయం అందించింది. సాయం అందలేదంటూ పలువురు బాధితులు రోడ్లపైకి వచ్చారు.

ఒడుదొడుకులు..

పారిశ్రామిక రంగం కొన్ని ఒడిదొడుకులను ఎదుర్కొంది. కొన్ని దిగ్గజ సంస్థలు భాగ్యనగరానికి వరుసకట్టాయి. డాటా సెంటర్ ఏర్పాటు కోసం అమెజాన్ సంస్థ రూ. 27 వేల కోట్ల పెట్టుబడులతో ముందుకొచ్చింది. ఈస్టర్ ఫిల్మ్, ఫియట్, మెట్రానిక్స్, వెల్​స్పన్, మేధాసర్వో, లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్స్ ఇండియాతో పాటు పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ప్రత్యేక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అదే రోజు కొన్ని కంపెనీలు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నాయి.

ఐటీ గ్రిడ్​ పాలసీ..

హైదరాబాద్​పై ఒత్తిడి తగ్గించడం సహా వర్క్ టు వాక్ విధానాన్ని ప్రోత్సహించేలా సమీకృత టౌన్​షిప్ పాలసీ ప్రభుత్వం తీసుకొచ్చింది. భాగ్యనగరంలోని శివారు ప్రాంతాలకు ఐటీని విస్తరించేందుకు వీలుగా ఐటీ గ్రీడ్​ పాలసినీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ద్వితీయశ్రేణి నగరాలకు ఐటీ విస్తరణలో భాగంగా జిల్లాల్లో ఇప్పటికే ఐటీ హబ్​లను ప్రారంభించిన సర్కారు.. మరికొన్నింటికి శంకుస్థాపన చేసింది. ఆన్​లైన్​లో భవన నిర్మాణ అనుమతుల కోసం టీఎస్​ బీపాస్ అమల్లోకి తీసుకొచ్చింది.

భారత్​ బయోటెక్​కు ప్రధాని..

అదే సమయంలో రాష్ట్రానికే చెందిన భారత్​ బయోటెక్​ సంస్థ కొవిడ్​ వ్యాక్సిన తయారీలో ముందుకెళ్తోంది. కొవాగ్జిన్​ మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​ జరుగుతున్నాయి. ప్రధానిమంత్రి మోదీ స్వయంగా హైదరాబాద్​ వచ్చి భారత్​ బయోటెక్​ను సందర్శించారు. టీకా సన్నద్దతను సమీక్షించారు.

ధరణి..

పారదర్శక, జవాబుదారీతనం, సులువుగా భూ లావాదేవీలు జరిగేలా కొత్త రెవెన్యూ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. వీఆర్వోల పోస్టులను రద్దు చేసింది. ధరణి పోర్టల్ ద్వారా ఆన్​లైన్ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరిగేలా కొత్త చట్టాన్ని తీసుకొచ్చి.. పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు చేసింది. కొత్త రెవెన్యూ విధానం నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు కొన్నాళ్ల పాటు నిలిచిపోయాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ధరణి పోర్టల్ ద్వారా ప్రారంభమయింది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు మాత్రం ధరణి ద్వారా జరగలేదు. ఆధార్, కుటుంబసభ్యుల వివరాలు అడగడంపై న్యాయస్థానం అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో పాత విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సి వచ్చింది. వందరోజులుగా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం వల్ల ప్రజలు, స్థిరాస్తి, నిర్మాణ రంగాలకు ఇక్కట్లు ఎదురయ్యాయి.

ఎల్​ఆర్​ఎస్​..

రాష్ట్రవ్యాప్తంగా ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం ఎల్ఆర్ఎస్​ను తీసుకొచ్చింది. క్రమబద్ధీకరణ రుసుం ఎక్కువగా ఉందన్న వాదన నేపథ్యంలో 2015 పథకం ధరలనే వర్తింప జేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

యాభై వేల ఉద్యోగాలకు..

వివిధ ప్రభుత్వ శాఖల్లోని యాభై వేల ఉద్యోగాల భర్తీకి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. పెండింగ్​లో ఉన్న ఉద్యోగుల వేతన సవరణను ఖరారు చేసే ఆలోచనలో ఉంది. వందశాతం అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈ ఏడాది ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ తొలుత నిర్ణయించారు. ఈచ్ వన్ టీచ్ వన్ ప్రాతిపదికన అందరూ ఈ అక్షర యజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా నిరక్షరాస్యుల గుర్తింపు కోసం సర్వే చేపట్టారు. కరోనా విజృంభణ దృష్ట్యా ఈ కార్యక్రమం సాధ్యపడలేదు.

మెట్రో సహా..

హైదరాబాద్​లోని కొన్ని ప్రాంతాలు సహా జిల్లాల్లో కొన్ని చోట్ల రెండు పడక గదుల ఇళ్లను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ మెట్రో రైల్​లో జేబీఎస్ - ఎంజీబీఎస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. కొన్ని జాతీయ రహదారుల పనుల ప్రారంభోత్సవం.. మరికొన్నింటికి శంకుస్థాపన జరిగింది. కొన్ని కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పాటయ్యాయి. తొలిసారిగా రాష్ట్రంలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది రాష్ట్రంలో ఆరో విడత హరితహారం కార్యక్రమం ప్రారంభమైంది. యాదాద్రి నమూనాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, పల్లెల్లో ప్రకృతివనాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కొన్ని చోట్ల ప్రకృతి వనాలు పూర్తై ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.

2020 ఏడాది తెలంగాణకు కొన్ని విజయాలు తెచ్చిపెట్టగా.. అత్యధికశాతం అవస్థలు పెట్టింది. పెట్టుబడుల ప్రవాహం.. ఐటీ హబ్​.. పెరిగిన పంట దిగుబడి వంటి సానుకూలతలున్నా.. లాక్​డౌన్​, వరదలు, ధరణి సమస్యలు, జలజగడాలతో ఈ ఏడాది గడిచిపోయింది

ఇవీచూడండి: కలిసిరాని 2020... కాంగ్రెస్​కు చేదు జ్ఞాపకాలు

రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన 2020

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.