ETV Bharat / state

20 ఏళ్ల సేవా 'తరుణి' వేడుకలు

author img

By

Published : Mar 5, 2020, 7:25 PM IST

మహిళలకు చేయూతనిస్తే పురుషుల కంటే మెరుగ్గా రాణిస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం, తరుణి స్వచ్ఛంద సంస్థ 20 ఏళ్ల వార్షికోత్సవాన్ని రవీంద్ర భారతిలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

20 year old Seva 'Taruni' celebrations at ravindra bharathi hyderabad
20 ఏళ్ల సేవా 'తరుణి' వేడుకలు

తరుణి స్వచ్ఛంద సంస్థ 20 ఏళ్ల వార్షికోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఓ సదస్సును నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గత 20 ఏళ్లుగా తరుణి సంస్థ రాష్ట్రంలో బాల్య వివాహాలు, భ్రుణ హత్యలు, బాల కార్మిక వ్యవస్థ నిర్ములనకు విశేషంగా కృషి చేస్తుందని డీజీపీ అన్నారు. బాలిక సంఘాలు సైతం ఏర్పాటు చేసి 17 వేల మంది బాలికల జీవితాల్లో వెలుగు నింపిందన్నారు. సమాజంలో మార్పునకు ఎవరో ముందుకు రావాలని కాకుండా ఆ బాధ్యతను సంస్థ వ్యవస్థాపకురాలు డా.మమతా రఘువీర్ తీసుకుని పోరాటాలు చేసిందన్నారు.

ఎన్నో ఆటుపోట్లు

ఎన్నో ఆటుపోట్లు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ బాలికల అభ్యున్నతికి కృషి చేసిందని ఐఏఎస్ పార్థసారథి అన్నారు. తరుణి సాధించిన విజయాలకు ఈ కార్యక్రమం ఒక సూచిక అని పేర్కొన్నారు. తోటి వ్యక్తికి కష్టం వస్తే చలించే వ్యక్తి మమత అని కొనియాడారు. బాలలు, స్త్రీల అభివృద్ధి, హక్కుల సాధన కోసం తరుణి సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఆ సంస్థ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపధ్యంలో 'మమతానురాగల తరుణి' పుస్తకాన్ని ఆవిష్కరించారు.

కుటుంబంలో మహిళలను ప్రోత్సహించి వారి లక్ష్యాలు చేరుకునేందుకు వెన్నంటే ఉన్న పురుషులను ఘనంగా సన్మానించారు. బాలికలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలుపై చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రో ఫ్లెమింగ్, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ పార్థసారధి, వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, మహిళా భద్రతా విభాగం ఐజీ. స్వాతి లక్రా, మహిళా కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ త్రిపురాన వెంకటరత్నం, తదితరులు పాల్గొన్నారు.

20 ఏళ్ల సేవా 'తరుణి' వేడుకలు

ఇదీ చూడండి : మద్దతు ధర కోసం కదంతొక్కిన పసుపు రైతులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.