ETV Bharat / state

అక్కాచెల్లెళ్ల అకాల మరణం.. అమ్మానాన్నలకు తీరనిశోకం... - 2 DAUGHTERS DIED ON SAME DAY IN HYDERABAD

అప్పటి వరకూ ఆ ఇంటి మహాలక్ష్ములిద్దరూ ఆడుతూ పాడుతూ తిరిగారు. ఒక్కసారిగా అనారోగ్యం పాలై... ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. దురదృష్టవశాత్తు అక్కాచెల్లెల్లిద్దరూ చికిత్స పొందుతూ ఒకే రోజు మృతి చెందారు. ఎంతో అల్లారుమద్దుగా పెంచుకున్న కూతుళ్లు ఒకేరోజు చనిపోవడం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

అక్కాచెల్లెళ్ల అకాల మరణం.. అమ్మానాన్నలకు తీరని శోకం
author img

By

Published : Nov 14, 2019, 4:18 PM IST

అక్కాచెల్లెళ్ల అకాల మరణం.. అమ్మానాన్నలకు తీరని శోకం

హైదరాబాద్ రాజేంద్రనగర్​ పరిధిలోని చింతల్‌మెట్‌ ఎమ్‌ఎమ్ పహాడీలో మహమ్మద్ మస్తాన్ తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. ఆయనకి భార్య, పదకొండేళ్ల మెన్హాజ్‌ బేగం, తొమ్మిది సంవత్సరాల నైనా అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.

ఇద్దరూ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. తల్లిదండ్రులు వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితిలో మార్పులేకపోవడం వల్ల హఫీజ్‌పేటలోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెన్హాజ్ బేగంను చేర్చుకున్న ఆసుపత్రి వర్గాలు... నైనాను నిలోఫర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు.

నైనా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంతలోనే మెన్హాజ్ బేగం కూడా చనిపోయింది. ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురికావడం, ఒకే రోజు చనిపోవడం వల్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారుల మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి: శబరిమల' కేసు విస్తృత ధర్మాసనానికి బదిలీ

Tg_HYD_15_14_Two_babies_dead_ab_ts10020 Contributir: Bhujanga Reddy Script: Razaq Note: ఫీడ్ డెస్క్‌ వాట్సాప్‌కు వచ్చింది. ( ) హైదరాబాద్ నగర శివారు రాజేంద్రనగర్‌లో ఓ ఇంట్లో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు చిన్నారులు ఒకే సారి మృతి చెందిన హృదయ విధారకర సంఘటన రాజేంద్రనగర్‌ పరిధిలోని చింతల్‌మెట్‌ ఎమ్‌ఎమ్ పహాడీలో చోటుచేసుకుంది. చిన్నారులిద్దరు ఒకే సారి చనిపోవడంతో తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ రోదిస్తుండడంతో వారిని ఓదార్చడానికి ఎవరితరం కావడంలేదు. స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్న మహ్మద్ మస్తాన్ అలీకి ఇద్దరు కూతుళ్లు. పదకొండేళ్ల మెన్హాజ్‌ బేగం, తొమ్మిది సంవత్సరాల నైనాలున్నారు. వీరు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. వీరిరువురూ రెండు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. వీరిని స్థానికంగా ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్థితిలో మార్పులేకపోవడంతో హఫీజ్‌పేటలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ మెన్హాజ్ బేగంను చేర్చుకున్న ఆసుపత్రి వర్గాలు నైనాను నిలోఫర్‌కు తీసుకువెళ్లాలని సూచించారు. నైనా నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంతలోనే మెన్హాజ్ బేగం కూడా చనిపోయింది. ఇద్దరు ఒకేసారి అస్వస్థతకు గురికావడం ఒకే రోజు మృతి చెందడంతో పలు అనుమానాలు రేకెత్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత చిన్నారుల మృతికి కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. బైట్‌: చిన్నారుల తల్లిదండ్రులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.