పలకా బలపం పట్టాల్సిన చేతులతో ఇటుకలు మోపిస్తున్నారు. తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన చిన్నారులను ఎండలో పనులు చేయిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 గంటల పాటు వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇటుక బట్టీ నిర్వాహకులు. స్థానికుల సమాచారంతో డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, బచ్పన్ బచావో ఆందోళన్ సభ్యులు రంగంలోకి దిగి 5 ఇటుక బట్టీలపై జిల్లా బాలల రక్షణ అధికారి రాకేష్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. 18 మంది బాలకార్మికులకు వెట్టి చాకిరీ నుంచి విముక్తి కలిగించారు. ఇందులో 15 మంది బాలికలు, 3 బాలురు ఉన్నారు. నెల్లూరుకు చెందిన ప్రసాద్, కిష్టయ్యలు ఒడిశాకి చెందిన చిన్నారులతో చాకిరీ చేయిస్తున్నారని వారిపై ఏఫ్ఐఆర్ నమోదు చేసినట్లు రాకేష్ వివరించారు.
ఇవీ చూడండి: శరవేగంగా కాళేశ్వరం: జల లక్ష్యానికి చేరువలో తెలంగాణ