ETV Bharat / state

ఉద్యోగాల జాతర.. మూడు రోజుల్లో 16940 పోస్టులకు నోటిఫికేషన్​! - తెలంగాణలో ఉద్యోగాల జాతర

CS Someshkumar job placements review in telangana state: 16,940 పోస్టులకు మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు సీఎస్​ సోమేశ్​కుమార్​ తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. భూగర్భ జల వనరులశాఖలో 57 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది.

job notification
తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్​
author img

By

Published : Nov 29, 2022, 7:52 PM IST

CS Someshkumar job placements review in telangana state: ఇప్పటి వరకు 60వేల పైచిలుకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వగా... మరో 16వేలకు పైగా పోస్టులకు మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియపై పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్దన్​ రెడ్డితో కలిసి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో 60,929 పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు.

మరో 16,940 పోస్టులకు కూడా మరో మూడురోజుల్లో అనుమతులు ఇవ్వనున్నట్లు చెప్పారు. నియామకాల ప్రక్రియలో గడువులు నిర్దేశించుకుని పనిచేయాలన్న సీఎస్​... ప్రక్రియ త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో నోటిఫికేషన్లు జారీ చేసేందుకు వీలుగా అవసరమైన సమాచారాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్​కు అందించాలని ఆయా శాఖల అధికారులకు సీఎస్ స్పష్టం చేశారు. ఉద్యోగ నియామాక ప్రక్రియ పురోగతిని ప్రతిరోజూ పర్యవేక్షించాలని ఆదేశించారు.

భూగర్భ జల వనరుల శాఖ ఉద్యోగ నోటిఫికేషన్​:​ రాష్ట్రంలో మరో 57 పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీచేసింది. భూగర్భ జల వనరులశాఖలో 32 గెజిటెడ్, 25 నాన్‌గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి.. నోటిఫికేషన్ వెలువరించింది. డిసెంబర్‌ 6 నుంచి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.