ETV Bharat / state

ఉపాధ్యాయులపై కరోనా పంజా... 166 మంది మృత్యువాత

ఉపాధ్యాయులపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలో 166 మంది ఉపాధ్యాయులు వైరస్​తో మృత్యువాత పడ్డారు. ఎన్నికల విధుల్లో పాల్గొన్న 500 మందికి కొవిడ్​ సోకింది. విశ్రాంత ఉపాధ్యాయులు మరో 59 మంది ఈ కరోనా బారిన పడ్డారు.

teachers
ఉపాధ్యాయులపై కరోనా కాటు
author img

By

Published : May 15, 2021, 7:50 AM IST

Updated : May 15, 2021, 8:44 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఉపాధ్యాయులు మృత్యువాతపడ్డారని, రోజుల తరబడి ఆసుపత్రుల్లో చికిత్స పొందినా రూ.లక్షలు ఖర్చవుతున్నాయి తప్ప.. ప్రాణాలు మాత్రం దక్కడంలేదని టీఎస్‌యూటీఎఫ్‌ ఆందోళన వ్యక్తంచేసింది. ఈ నెలన్నర రోజుల్లోనే సర్వీసులో ఉన్న వారితోపాటు విశ్రాంత ఉపాధ్యాయులు మొత్తం 225 మంది కరోనా కాటుకు బలయ్యారని తెలిపింది. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ, వరంగల్‌, ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విధులు నిర్వహించిన ఉపాధ్యాయుల్లో 500 మందికిపైగా కరోనా బారిన పడ్డారని, వారిలో ఇప్పటికే 15 మంది వరకు చనిపోయారని వెల్లడించింది.

కరోనా రెండోదశలో ఈనెల 14 నాటికి మృతి చెందిన టీచర్ల జాబితాను టీఎస్‌యూటీఎఫ్‌ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 225 మంది మరణించగా వారిలో 166 మంది సర్వీసులో ఉన్నవారు కాగా.. మిగిలిన 59 మంది విశ్రాంత ఉపాధ్యాయులు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందినా చాలా ప్రాణాలు దక్కగపోగా రూ.లక్షలు ఖర్చయి కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ప్రభుత్వం నుంచి మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ ఉంటుందనే ఉద్దేశంతో చాలామంది టీచర్లు మెడికల్‌ పాలసీని తీసుకోరు. ప్రభుత్వం కరోనా చికిత్సకు రూ.లక్ష మాత్రమే ఇస్తోంది. ఆసుపత్రుల్లో అందుకు పదింతల ఖర్చవుతోంది. ఆ మొత్తాన్ని సొంతగా భరించాల్సి వస్తోంది. కేజీబీవీ కాంట్రాక్టు ఉపాధ్యాయులకైతే ఏ ఆసరా లేక కుటుంబాలు వీధుల పాలవుతున్నాయి.

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉపాధ్యాయురాలిగా ఉన్న డి.సంధ్యారాణ(35) నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల విధులు నిర్వహించిన రెండు రోజులకు కొవిడ్‌ లక్షణాలు కనిపించగా హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. నాలుగు రోజుల తర్వాత పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరి 12 రోజులపాటు చికిత్స పొందినా ప్రాణాలు దక్కలేదు. మొత్తం రూ. 13 లక్షలు ఖర్చయ్యాయి.

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బకాల్‌వాడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి.లకృతి నాయక్‌(53) హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రిలో 20 రోజులు చికిత్స పొందారు. అందుకు రూ.15 లక్షలు ఖర్చయినా ప్రయోజనం దక్కలేదు.

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీ అయిన సుబ్బారెడ్డి(47) కరోనాతో ఓ ఆసుపత్రిలో చేరి అయిదు రోజుల అనంతరం మృతిచెందారు. రూ.ఆరున్నర లక్షల బిల్లు అయింది. బంధువుల సహకారంతో బిల్లు చెల్లించారు. సుబ్బారెడ్డికి ఆలస్యంగా ఉద్యోగం వచ్చింది. ఇద్దరు చిన్న పిల్లలు, భార్య పీజీ చేసిన నిరుద్యోగి. ప్రస్తుతం ఈ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది.

ఆ కుటుంబాలను ఆదుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల కొవిడ్‌ మరణాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.జంగయ్య, ప్రధాన కార్యదర్శి రవి కోరారు. రూ.లక్షలు ఖర్చవుతుంటే ప్రభుత్వం రూ. లక్ష మాత్రమే తిరిగి చెల్లిస్తోందని, అదీ రిఫరల్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికే ఇస్తుందన్నారు. వైద్య ఖర్చుల తిరిగి చెల్లింపుపై రూ.లక్ష గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలని కోరారు.

వివరాలిలా…

ఇదీ చదవండి: అంబులెన్సులను ప్రభుత్వం ఏ రకంగానూ అడ్డుకోవద్దు: హైకోర్టు

Last Updated : May 15, 2021, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.