ETV Bharat / state

తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది: హరీశ్​

పట్టణ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.15,030 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అసెంబ్లీలో తెలిపారు. పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.

author img

By

Published : Mar 18, 2021, 2:28 PM IST

500 crores allocated to urban development in 2021 budget
తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది: హరీశ్​

పల్లె ప్రగతి స్ఫూర్తితో ప్రభుత్వం పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ తెలిపారు. నేడు తెలంగాణలో పట్టణీకరణ వేగంగా జరుగుతుందని... దానికి అనుగుణంగా సౌకర్యాలు పెరగాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిందని చెప్పారు. నూతన మున్సిపాలిటీ చట్టం ద్వారా ప్రజా ప్రతినిధులకు అధికారాలు, బాధ్యతలను స్పష్టంగా నిర్దేశించిందని... పారదర్శకంగా పట్టణ పరిపాలన సాగే విధంగా చట్టాలు నిబంధనలు పొందుపరిచిందని పేర్కొన్నారు.

మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసిన మురుగు కాల్వల పక్కన చేపల అమ్మకం, ఫుట్​పాత్​లపైన కూరగాయల అమ్మకాలు జరుగుతున్నాయి. గజ్వేల్​లో ఒక మోడల్​ మార్కెట్​ను ఇప్పటికే నిర్మించాం. దీని స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇటువంటివి ఏర్పాటు చేయనున్నాం, సమీకృత వెజ్​-నాన్​వెజ్​ మార్కెట్లను ప్రతీ పట్టణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు గాను ఈ బడ్జెట్​లో రూ.500 కోట్ల నిధులను ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. ప్రజల సౌకర్యం కోసం విరివిగా పబ్లిక్​ టాయిలెట్లను ప్రభుత్వం నిర్మిస్తుంది. మొత్తంగా పట్టణాభివృద్ధికి రూ.15,030కోట్లు కేటాయించాం.

-హరీశ్​ రావు, ఆర్థిక శాఖ మంత్రి

ఇదీ చదవండి: 'ఆడబిడ్డల తల్లిదండ్రుల కళ్లలో సంతృప్తే సర్కారుకు సార్థకత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.