ETV Bharat / state

రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి - telangana covid cases latest News

రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు, ఏడుగురు మృతి

author img

By

Published : Jul 21, 2020, 9:45 PM IST

Updated : Jul 22, 2020, 12:16 AM IST

21:38 July 21

రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు.. ఏడుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు, ఏడుగురు మృతి
రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు, ఏడుగురు మృతి

రాష్ట్రంలో కొత్తగా 1430 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి కొవిడ్ బాధితుల సంఖ్య 47,705కి చేరుకుంది. మహమ్మారి నుంచి కోలుకుని 2,062 మంది డిశ్చార్జయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్ నుంచి 36,385 మంది బాధితులు కోలుకున్నారు. 10,891 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వైరస్ కారణంగా ఏడుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 429కి పెరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 703 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం 16, 855 పరీక్షలు చేసినట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,93, 077 మందికి వైరస్​ నిర్ధరణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపాయి.

తాజాగా రంగారెడ్డి జిల్లాలో 117, మేడ్చల్ 105,  సంగారెడ్డి 50, కామారెడ్డి 43, వరంగల్ అర్బన్ 34, వరంగల్​ రూరల్ 20, కరీంనగర్ 27, మెదక్ 26, జయశంకర్ భూపాలపల్లి 27, నల్గొండ 45, నిజామాబాద్ 48 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇటీవలి కాలంలో జీహెచ్ఎంసీ తోపాటు పలు జిలాల్లో కారోనా కేసులు భారీగా నమోదవటం ఆందోళన కలిగిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... అత్యవసరం అయితే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావద్దని వైద్య ఆరోగ్యశాఖ సూచిస్తోంది.

ఇవీ చూడండి : గాలి ద్వారా కరోనా వ్యాప్తికి అవకాశం: సీఎస్​ఐఆర్​​

Last Updated : Jul 22, 2020, 12:16 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.