రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,24,430 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 1,417 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. తాజాగా 12 మరణాలు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,10,834కి చేరింది.
తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో 3,546 మంది మహమ్మారికి బలయ్యారు. 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 1,897 మంది కోలుకోగా.. 19,029 యాక్టిక్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు వైద్యారోగ్య శాఖ 1,73,14,780 నమూనాలను పరీక్షించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 149 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చూడండి: Curfew rules: 'కర్ఫ్యూ నిబంధనలను కఠినంగా అమలు చేయాలి'