ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా దేవరాపల్లి మండలం తెనుగుపూడి అటవీ సెక్షన్ పరిధిలోని చీడికాడ మండలం తంగుడుబిల్లి పొలాల్లో సుమారు 14 అడుగులకు పైగా పొడవున్న గిరినాగును ఆ ప్రాంత రైతులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ అధికారి ఎం.రమేష్‌కుమార్‌కి చెప్పడంతో ఆయన విశాఖలోని వన్యప్రాణి సంరక్షణ సమితి అధికారి మూర్తికి తెలిపారు. ఆయన హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని పొదల్లో ఉన్న గిరి నాగును చాకచక్యంగా పట్టుకున్నారు. వాలాబు సమీపంలోని చెరుకుపల్లి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టినట్లు రమేష్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: వేడుకల తీరును మార్చిన కరోనా!