ETV Bharat / state

14 ఫేక్​ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు

మొబైల్ నుంచి కేవలం 5 నిమిషాల్లో లక్షల రుణం పొందండి అంటూ అమాయకులకు ఎర వేస్తారు. రుణం తీసుకున్నాక 30 నుంచి 50 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తారు. అడగకపోయినా ఖాతాలో నగదు జమ చేసి.. ఆ తర్వాత అధిక వడ్డీలతో వేధింపులకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పుణెలో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు.

14 Fake loan apps three Defendants in rachakonda custody
14 ఫేక్​ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు
author img

By

Published : Dec 27, 2020, 4:26 PM IST

Updated : Dec 27, 2020, 4:52 PM IST

14 ఫేక్​ రుణాల యాప్‌లు.. అదుపులో నిందితులు

రుణ యాప్‌ల వేధింపుల కేసులో మరో ముగ్గురిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పుణేలో మగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు పూణేకు చెందిన పరశురామ్‌తోపాటు భార్య లియాంగ్ టియాన్, పరుశురామ్‌ అనుచరుడు షేక్ ఆకిబ్​లను అదుపులోకి తీసుకున్నారు. వీరు కాల్‌ సెంటర్‌లో 600 మంది సిబ్బందిని నియమించుకుని నిర్వహిస్తున్నారని సీపీ వెల్లడించారు.

వారు 50 శాతం వడ్డీ రేటుతో రుణాలు ఇస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని అన్నారు. పూణే కేంద్రంగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 101 ల్యాప్‌టాప్‌లు, 106 సెల్‌ఫోన్లు, సీసీటీవీలు, డీవీఆర్‌లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రుణయాప్‌ కంపెనీ బ్యాంకు ఖాతాలకు చెందిన రూ.1.42 కోట్ల లావాదేవీలు నిలిపివేశామని సీపీ వెల్లడించారు.

ముంబాయికి చెందిన అజయా సొల్యూషన్, బియాంత్ ఇన్‌ఫ్రాటెక్చర్ టెక్నాలజీ, కర్ణాటకకు చెందిన టాల్‌ డే టెక్నాలజీ కంపెనీలకు సంబంధించిన మొత్తం దాదాపు 14 ఇతర నకిలీ రుణ యాప్​లను గుర్తించినట్లు రాచకొండ సీపీ మహేశ్​ భగవత్​ వెల్లడించారు. బబల్​ లోన్​, రూపీ బజార్​, ఓకే క్యాష్​, రూపీ ఫాక్టరీ, పైసా లోన్​, వన్​ హోప్​, క్యాష్​ బీ, ఇన్​ నీడ్​, స్నాప్​ లోన్​, పిక్కి బ్యాంక్​, క్రేజీ రూపీ, రియల్​ రూపీ, రూపీ బియర్​, రూపీ మోస్ట్​లను గుర్తించినట్లు పేర్కొన్నారు.

రుణ యాప్‌ల వ్యవహారంలో ఇప్పటికే 24 మంది అరెస్టయ్యారు. నిందితులు రుణం తీసుకున్న వారికి కాల్‌ సెంటర్ల ద్వారా ఫోన్లు చేయించి వేధిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చూడండి : రుణ సంస్థలో చోరీకి యత్నం... అదుపులో ఇద్దరు నిందితులు

Last Updated : Dec 27, 2020, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.