మంగళవారం కొత్తగా 2,392 కేసులు నమోదవగా, మొత్తం బాధితుల సంఖ్య 1,45,163కు పెరిగింది. 11 మంది మృత్యువాతపడగా, మొత్తం మృతుల సంఖ్య 906కు పెరిగింది. ఇప్పటివరకూ ఎటువంటి లక్షణాల్లేకుండా కరోనా నిర్ధారణ అయినవారు 1,00,162(69శాతం) మంది ఉండడం విశేషం. ఏదో ఒక లక్షణంతో ఉన్నవారు 45,001(31శాతం) మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులతోపాటు ఇళ్లలో 31,670 మంది చికిత్స పొందుతున్నారు.
తాజా ఫలితాల్లో 8 జిల్లాల్లో 100కి పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ(హైదరాబాద్) పరిధిలో 304 పాజిటివ్‌లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి(191), కరీంనగర్(157), మేడ్చల్ మల్కాజిగిరి(132), ఖమ్మం(116), నల్గొండ(105), నిజామాబాద్(102), సూర్యాపేట(101)గా నమోదయ్యాయి. 20కి పైగా కేసులు నమోదైన జిల్లాల జాబితాలో భద్రాద్రి కొత్తగూడెం(95), వరంగల్ నగర(91), సిద్దిపేట(89), కామారెడ్డి(76), మహబూబాబాద్(71), మంచిర్యాల(69), పెద్దపల్లి(68), జగిత్యాల(64), రాజన్న సిరిసిల్ల(64), యాదాద్రి భువనగిరి(57), నాగర్‌కర్నూల్(53), మహబూబ్‌నగర్(45), వనపర్తి(40), జనగామ(38), సంగారెడ్డి(37), మెదక్(36), నిర్మల్(34), ఆదిలాబాద్(33), జోగులాంబ గద్వాల(22), వరంగల్ గ్రామీణ(21), కుమురంభీం ఆసిఫాబాద్(20), ములుగు(20) జిల్లాలున్నాయి.
పరీక్షల సంఖ్య 18,27,905
సోమవారం కొత్తగా 60,923 నమూనాలను పరీక్షించగా, వీటిలో ప్రైమరీ కాంటాక్టు వ్యక్తులు 27,415(45శాతం) మంది ఉండగా, సెకండరీ కాంటాక్టు వ్యక్తులు 8,529(14శాతం) మంది ఉన్నారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 18,27,905కు పెరిగింది. మరో 1,606 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో మరణాల శాతం 0.62 శాతం కాగా, ఈ విషయంలో జాతీయ సగటు 1.69 శాతమని ఆరోగ్యశాఖ తెలిపింది.
ప్రైవేటులో 10వేల పడకలు
నెల రోజుల కిందట ప్రైవేటులో 6,823 పడకలుండగా, ఇప్పుడు వాటి సంఖ్య 10,312కు పెరిగింది. వీటిలో ఐసీయూ పడకలు 2,037, ఆక్సిజన్ పడకలు 4,517 ఉండగా, మిగిలినవి ఐసొలేషన్ పడకలు. సోమవారం నాటికి ప్రైవేటులో 4,429 పడకల్లో 5883 ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ వైద్యంలోనూ 8,052 పడకలు అందుబాటులో ఉండగా, 5,390 పడకలు ఖాళీగా ఉన్నాయి.
ఏపీలో 10,601 కొత్త కేసులు
73 మంది మృతి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మంగళవారం నాటికి మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు చేరింది. సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 70,993 నమూనాలు పరీక్షించగా.. 10,601 కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనాతో మరో 73 మంది చనిపోయారు. మొత్తం మృతుల సంఖ్య 4,560కు చేరింది.
- ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.
- కర్ణాటకలో మంగళవారం మరో 7,866 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులు 4,12,190కి పెరిగాయి. మరో 146 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 6,680కి పెరిగింది.
- తమిళనాడులో మంగళవారం కొత్తగా 5,684 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,74,940కి చేరింది. 87 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 8,012కి పెరిగింది.