ఏపీ పదోతరగతి పరీక్షలను జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించేందుకు ఆ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమర్పించింది. ఏపీ వ్యాప్తంగా 4వేలకుపైగా కేంద్రాల్లో 6.28లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు నిర్వహించనున్నారు.
సామాన్యశాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయి. భౌతిక, రసాయనశాస్త్రం పేపర్-1గా జీవశాస్త్రం పేపర్-2గా 50మార్కుల చొప్పున నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి: KTR: రైతును రాజును చేయడమే ప్రభుత్వ లక్ష్యం