డిసెంబర్ 3న ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పారా అథ్లెట్స్, సెలెబ్రిటీలతో కలిసి ఈరోజు ఉదయం నెక్లస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా నుంచి సాలిడరటీ రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరయ్యారు. 10కె సైక్లింగ్, 10కె, 5కె పరుగులను జెండా ఊపి ప్రారంభించారు.
సీఆర్పీఎఫ్, ఆదిత్యా మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్, సీనీ దర్శకుడు రాజమౌళి, పలువురు ప్రముఖులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జీవితంలో ఎన్నో సమస్యలు, విపత్తులు ఎదురవుతాయని వాటిని ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సీపీ అంజనీ కుమార్ సూచించారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువతకు నూతన ఉత్సాహం వస్తుందని సీపీ అభిప్రాయ పడ్డారు.
ఇదీ చూడండి : ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు రేపటి నుంచే...!