corona cases: రాష్ట్రంలో కొవిడ్ కేసులు మరోమారు భారీగా నమోదవుతున్నాయి. తాజాగా 1000కి పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,054 మంది మహమ్మారి బారినపడినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. తాజా కేసులతో ఇప్పటి వరకు 8,21,671 మందికి వైరస్ సోకినట్లు అయింది. తాజాగా 795 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 8,11,568 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 5,992 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.
తాజాగా నమోదైన కేసులలో హైదరాబాద్ 396, రంగారెడ్డి 60, మల్కాజిగిరి 60, ఆదిలాబాద్ 9, భద్రాద్రి కొత్తగూడెం 6, జగిత్యాల 5, జనగామ 17, జయశంకర్ భూపాలపల్లి 3, గద్వాల 9, కామారెడ్డి 6, కరీంనగర్ 46, ఖమ్మం 35, ఆసిఫాబాద్ 3, మహబూబ్నగర్ 24, మహబూబాబాద్ 26, మంచిర్యాల 31, మెదక్ 13, ములుగు 9, నాగర్కర్నూల్ 7, నల్గొండ 49, నారాయణపేట్ 2, నిర్మల్ 1, నిజామాబాద్ 21, పెద్దపల్లి 35, సిరిసిల్ల 36, సంగారెడ్డి 29, సిద్దిపేట 30, సూర్యాపేట 19, వికారాబాద్ 9, వనపర్తి 3, వరంగల్ రూరల్ 8, హన్మకొండ 27, భువనగిరి 20 చొప్పున నమోదైనట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.
ఇవీ చూడండి..
రైతులను పొట్టబెట్టుకున్న రాకాసి పిడుగులు.. ఒకేరోజు వేర్వేరు చోట్ల ముగ్గురు బలి..
దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. టాస్క్ఫోర్స్ ఏర్పాటు చేసిన కేంద్రం