తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టింది. తాజాగా రాష్ట్రంలో 1,028 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి కోలుకుని మరో 1,489 మంది బాధితులు ఇళ్లకు వెళ్లారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 15,054 కరోనా క్రియాశీల కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా శనివారం 1,18,427 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 6.01 లక్షల మంది కొవిడ్ నుంచి రికవరీ అయ్యారు.
ఇదీ చూడండి: Rains: తెలంగాణలో రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు