100 Acres Allotment to Telangana High Court : రంగారెడ్డి జిల్లాలోని రాజేంద్రనగర్‌లో హైకోర్టు నూతన భవన నిర్మాణానికి సంబంధించి మరో అడుగు ముందుకు పడింది. 100 ఎకరాల భూమిని న్యాయశాఖకు రిజిస్ట్రేషన్ చేయాలని ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్‌లను ప్రభుత్వం ఆదేశించింది. 1966లో అప్పటి ప్రభుత్వం రాజేంద్రనగర్ మండలం బుద్వేల్‌లో ఉన్న 2500 ఎకరాలను వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అప్పగించింది. అందులో వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు కొనసాగుతున్నాయి.
ప్రజా ప్రతినిధుల కేసులపై హైకోర్టు కీలక ఉత్తర్వులు
Telangana New High Court Building Allotment Area : హైకోర్టు నూతన భవన నిర్మాణం కోసం 100 ఎకరాలు కేటాయించాలని న్యాయశాఖ, రిజిస్ట్రార్ జనరల్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుద్వేల్‌లో భూమిని సైతం అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాల పేరు మీద ఉన్న భూమిలో 100 ఎకరాలను హైకోర్టు నూతన భవనం(Telangana New High Court) కోసం కేటాయించాలని నిర్ణయించారు. ఈ స్థలంలో నూతన హైకోర్టు భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు అన్నీ పాత భవనంలోనే జరగనున్నాయి. ఆ తర్వాత దాన్ని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయ పడుతోంది.
అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court Fire on GO of Unorganized Workers : అసంఘటితరంగ కార్మికులకు సంబంధించిన జీఓల విషయంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సీఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కార్మికశాఖ కమిషనర్, ప్రిటింగ్ ప్రెస్ కమిషనర్‌కు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. 5 రంగాలలో పనిచేసే అసంఘటితరంగ కార్మికులకు వేతనాలు పెంచుతూ 2022 జూన్‌లో జీఓలు విడుదలయ్యాయి. ఏడాదిన్నర దాటినా ఈ జీఓలను గెజిట్‌లో ప్రింట్ చేయలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఎండీ మనోహర్ సస్పెన్షన్ వేటుపై నిర్ణయం తీసుకోవాలి - లేదంటే చర్యలు తప్పవు : హైకోర్టు
Telangana High Court on Unorganized Workers Salary Judgement : గతేడాది అక్టోబర్ 10న విచారణకు స్వీకరించిన హైకోర్టు(High Court on Unorganized Workers Salary) ధర్మాసనం ఆరు వారాల్లోపు అసంఘటితరంగ కార్మికులకు వేతనాల జీఓలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు జీఓలను గెజిట్‌లో ప్రింట్ చేయలేదని న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ మరోసారి ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. జీఓలను గెజిట్‌లో ప్రింట్ చేయకపోవడం వల్ల దాదాపు 47 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులకు పెరిగిన వేతనాలు అమలు కాలేదని ప్రభాకర్ హైకోర్టుకు తెలిపాడు. దీంతో కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ రెండు వారాలకు వాయిదా - పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు