ETV Bharat / state

స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో 'కోట్లు' దోచేశారు! - స్టాక్​ మార్కెట్​లో పెట్టబడులని చెప్పి 10 కోట్లు మోసం

స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన ఫియాజ్​, హమీద్​, జహంగీర్​లు 100 మంది నుంచి 10 కోట్ల వరకు డిపాజిట్లు చేయించుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

స్టాక్​ మార్కెట్​లో పెట్టబడులని చెప్పి 10 కోట్లు మోసం

author img

By

Published : Jan 21, 2020, 10:42 AM IST

Updated : Jan 21, 2020, 12:31 PM IST

స్టాక్​ మార్కెట్​లో పెట్టబడులని చెప్పి 10 కోట్లు మోసం

స్టాక్ మార్కెట్​లో పెట్టుబడుల పేరుతో పలువురిని మోసం చేసిన కేసులో సీసీస్, సైబర్ క్రైం పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రకు చెందిన ఫియాజ్ మొహమ్మద్ అన్సారీ, హమీద్, మొహమ్మద్ జహంగీర్​లు అన్సారీ క్యాపిటల్ సొల్యూషన్, అన్సారీ పెర్ఫ్యూమ్స్ అండ్ కాస్మొటిక్స్ పేరుతో స్టాక్ ఎక్చెంజ్​ సంస్థలను స్థాపించారు. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ ప్రజలను నమ్మించారు.

మహారాష్ట్ర బివండిలో అరెస్టు:

హైదరాబాద్​ చాంద్రాయణగుట్టకు చెందిన మొహమ్మద్ జీలనీ షరీఫ్ వారి సంస్థలో లక్షల్లో పెట్టుబడి పెట్టాడు. ఆ డబ్బుకు సంబంధించి ఎటువంటి లావాదేవీలు జరగకపోవడం, వారి నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడం వల్ల మోసపోయానని గ్రహించిన జీలనీ గతేడాది సెప్టెంబర్​లో సీసీస్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఫియాజ్, హమీద్​లను ఆదివారం మహారాష్ట్రలోని బివండిలో అదుపులోకి తీసుకున్నారు.

100 మంది నుంచి 10 కోట్లు:

వారిని విచారించగా 100 మంది నుంచి 10 కోట్ల వరకు డిపాజిట్లు చేయించుకున్నట్లు వెల్లడించారు. మరో నిందితుడు మొహమ్మద్ జహంగీర్ పరారీలో ఉన్నాడని... అరెస్ట్ చేసిన ఇద్దరిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: విషాదం.. నీటికుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి

TG_HYD_06_21_STOCK_MARKET_CHEATING_AV_3181326 రిపోర్టర్-శ్రీకాంత్ NOTE- ఫీడ్ డెస్క్ వాట్సాప్ కు వచ్చింది. ( ) స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడిన ఇద్దరిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫయాజ్, హమీద్, జాంగీర్ అనే ముగ్గురు వ్యక్తులు కలిసి అన్సారీ కాపిటల్ సొల్యూషన్ ప్రారంభించారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతామని సుమారు 100మందితో 10కోట్ల మేర మోసం చేశారు. పాతబస్తీకి చంద్రాయణ్ గుట్టకు చెందిన గతేడాది సెప్టెంబర్ లో జిలానీ ఫిర్యాదు మేరకు సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏడాది కాలంగా తప్పించుకు తిరిగుతున్న ఫయాజ్, హమీద్, జాంగీర్... మహారాష్ట్రలోని బివండిలో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం సేకరించిన సీసీఎస్ పోలీసులు... బివండీ వెళ్లి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చారు. నాంపల్లి న్యాయస్థానంలో హాజరుపర్చి రిమాండ్ కు తరలించారు.
Last Updated : Jan 21, 2020, 12:31 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.