తన భర్తను తనకు అప్పజెప్పాలని ఓ వైద్యురాలు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించింది. నిర్మల్‌లో డిప్యూటీ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న మోహన్‌బాబుకు, తనకు 19 ఏళ్ల క్రితం పైళ్లైందని బాధితురాలు డాక్టర్ సలాంధ్ర రేణుక వివరించింది. మొదట్లో తమ వైవాహిక జీవితం సాపీగా సాగిందని, కొన్నాళ్ల తర్వాత వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని తనను దూరం పెట్టాడని ఆవేదన వ్యక్తం చేసింది. గతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కన్నీరు పెట్టుకుంది.
ఇదీ చూడండి: కోరుకున్న చోట... ఎంచుకున్న రోజు... ఎంసెట్ కౌన్సిలింగ్