విజయవంతంగా నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ-సీ45 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. నెల్లూరు జిల్లా షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై ఒక స్వదేశీ, 28 విదేశీ ఉపగ్రహాలతో పీఎస్‌ఎల్వీ-సీ45 ఈరోజు ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్‌కు శాస్త్రవేత్తలు ప్రీ కౌంట్‌డౌన్, ప్రయోగ రిహార్సల్స్ చేశారు. షార్ డైరెక్టర్ పాండియన్ అధ్యక్షతన లాంచ్ ఆథరైజేషన్ బోర్డు సమావేశమై రాకెట్ ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రాకెట్ ద్వారా డీఆర్‌డీవో రూపొందించిన 436 కేజీల ఈఎంఐ శాటిలైట్‌ను నింగిలో 749 కిలోమీటర్ల ఎత్తులో భూమధ్యరేఖకు 98 డిగ్రీల వాలులో ప్రవేశపెట్టారు.ఇది దేశ రక్షణ రంగానికి ఉపయోగపడనుంది.
అమెరికాకు చెందిన 20 భూపరిశీలన నానో ఉపగ్రహాలు, లిథువేనియాకు చెందిన 2, స్విట్జర్లాండ్, స్పెయిన్‌కు చెందిన ఉపగ్రహాలను రోదసీలో 504 కిలోమీటర్ల ఎత్తులో విడిచిపెట్టారు. తర్వాత దశల్లో'పీఎస్-4'ను మూడోకక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.ఈ దశలో ఇస్రో రూపొందించిన ఆటోమేటిక్ ఐడింటికేషన్ సిస్టమ్.... ఓడల కదలికలపై సమాచారం ఇవ్వనుంది.రేడియో అమెచ్యూర్ శాటిలైట్ కార్పొరేషన్ రూపొందించిన ఆటోమేటిక్ పాకెట్ రిపేరింగ్ సిస్టమ్..... రేడియో తరంగాల సమాచారాన్ని తెలపనుంది.
ఇవీ చూడండి:ఒకే గొడుగు కిందకు భూ సంబంధ శాఖలు