పురపాలక ఎన్నికలకు సిద్ధం కావాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. ఈ నెల 7లోపు జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశాలు నిర్వహించి ఎన్నికల కసరత్తు ప్రారంభించాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహాలపై చర్చించి, రాష్ట్ర నాయకత్వానికి నివేదిక అందించాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
ఇదీ చూడండి: 'అసంబ్లీ సమావేశాల ముందే రైతు రుణమాఫీ చేపట్టాలి'