ETV Bharat / state

తెరాస ఎంపీల్లో చెక్ ఎవరికి..? - TRS MP PONGULETI

తెరాసలో ఈసారి ఇద్దరు ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్ దక్కడం కష్టంగానే కనిపిస్తోంది. ప్రస్తుత సభ్యుల పనితీరు, బలబలాలు లెక్కలేసుకున్న అధిష్టానం..కొందరిని తప్పించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే అధికార పార్టీలో టికెట్ దక్కని నేతలు తమవైపు వస్తారని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇంతకీ తెరాసలో చెక్ పడేదెవరికి..?

తెరాస ఎంపీల్లో చెక్ ఎవరికి..?
author img

By

Published : Mar 13, 2019, 7:07 PM IST

ఆ ముగ్గురికి అనుమానమే..!
మహబూబ్‌నగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌ నియోజకవర్గాల పార్లమెంటు సభ్యులు జితేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఆజ్మీరా సీతారాంనాయక్‌లకు టికెట్లు ఇచ్చేది అనుమానంగానే ఉంది. మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాలలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ రెండు జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశానికి వీరికి ఆహ్వానం అందలేదు. దీంతో ఈ ముగ్గురి ఆశలు అడియాశలు అయినట్టేనని తెస్తోంది.

సిట్టింగ్​ ఎంపీల ఆఖరి ప్రయత్నాలు
మహబూబ్‌నగర్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి పరిస్థితి డోలాయమానంగా ఉంది. ఆయనపై ఎమ్మెల్యేల వ్యతిరేకత దృష్ట్యా టికెట్‌ రావడం కష్టమే. అక్కడ ప్రత్యామ్నాయంగా ఎంఎస్‌ ఔషధ సంస్థ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి లేదా రాజేంద్రప్రసాద్‌ రెడ్డిల పేర్లు తెరమీదికి వచ్చాయి. మాజీ ఎమ్మెల్యే కవిత సీఎంను కలిసి మహబూబాబాద్‌ ఎంపీ సీతారాంనాయక్‌కు బదులుగా తనకు టికెట్‌ ఇవ్వాలని కోరారు. ఖమ్మం స్థానంలో ప్రస్తుత ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై కేటీఆర్‌ కొంత సానుకూలంగా ఉన్నా కేసీఆర్‌ మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన స్థానంలో వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ అనే వ్యాపారవేత్త పేరును దాదాపుగా ఖరారు చేశారు. దీంతో పొంగులేటి నల్గొండ లేదా మల్కాజిగిరి స్థానం ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిసింది.

కారు దిగే నేతలపై కాంగ్రెస్ ఆశలు
మరోవైపు రేసు గుర్రాలపై దృష్టి పెట్టిన హస్తం అగ్రనేతలు..తెరాస అసంతృప్తులకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. టీఆర్​ఎస్​లో సీటు దక్కని కనీసం ముగ్గురు నేతలు తమవైపు వస్తారని ఏఐసీసీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఎవరైనా చివరి నిమిషంలో వస్తే ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారు. ఇప్పటి వరకు ఎవరూ సంప్రదించలేదని చెబుతున్నా.. వస్తారనే ఆశ మాత్రం పెట్టుకున్నారు.

ఇదీ చదవండి:గులాబీ అధినేత అదృష్ట సంఖ్య తెలుసా..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.