పట్టుచీరలు, బంగారు నగలు అంటే ఇష్టపడని అమ్మాయిలుండరు. అందుకే వీరికోసం ట్రెండ్స్ ప్రత్యేక వస్త్రాభరణాల ప్రదర్శన ఏర్పాటు చేసింది. వర్ధమాన సినీనటి అనికరావు, ప్రముఖ సామాజికవేత్త అంజనీ షా ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 78 మంది డిజైనర్లు రూపొందించిన వస్త్రాభరణాలు ఆకట్టుకుంటున్నాయి. చీరలు, డ్రెస్ మెటీరియల్స్, కుర్తా, ఆభరణాలు, చెప్పులు వంటి అన్ని రకాల వస్తువులు ఒకే చోట కొలువుదీరాయి. తమకు ఇష్టమైనవన్నీ ఒకే చోట ఉండటం వల్ల నచ్చినవి కొనుగోలు చేస్తూ నగర మహిళలు, యువతులు సందడి చేశారు.