ETV Bharat / health

ఈ ఆహారాలను కలిపి తింటే "బరువు" పెరుగుతారు జాగ్రత్త! - నిపుణులు సూచిస్తున్న ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఇవే! - FOODS TO AVOID FOR WEIGHT LOSS

బరువు తగ్గాలంటే ప్రత్యేకమైన డైట్, వ్యాయామం మాత్రమే కాదు - ఈ ఫుడ్ కాంబినేషన్స్​కు దూరంగా ఉండాలంటున్న నిపుణులు!

WEIGHT LOSS AVOID FOODS
Avoid These Food Combinations for Weight Loss (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 1, 2024, 10:58 PM IST

Avoid These Food Combinations for Weight Loss : నేటి రోజుల్లో చాలా మంది వయసుతో సంబంధం లేకుండా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అధిక బరువు. ముఖ్యంగా మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువసేపు ఆఫీసుల్లో కూర్చోవడం కారణంగా ఈజీగా బరువు పెరిగిపోతున్నారు. అధిక బరువు వల్ల గుండె జబ్బులు, జీర్ణ సంబంధిత, లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు అధికం. ఈ క్రమంలోనే బరువు ఎక్కువ ఉన్నవారు ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.

అందులో భాగాంగానే చాలా మంది అధిక బరువు సమస్యను దూరం చేసుకోవడానికి ఆహార నియమాలతో పాటు వ్యాయామ రొటీన్‌నీ పాటిస్తుంటారు. అయితే, బరువు తగ్గాలంటే వాటిని ఫాలో అవ్వడమే కాకుండా మీరు తీసుకునే పదార్థాల్లో కొన్ని కలిపి తీసుకోకూడదంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి సూరపనేని. అప్పుడే ఆరోగ్యంగా ఉండడంతో పాటు బరువూ తగ్గచ్చంటున్నారు. ఇంతకీ, వెయిట్ లాస్ అవ్వాలంటే తీసుకోకూడని ఆ ఫుడ్ కాంబినేషన్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓట్స్‌+డ్రై ఫ్రూట్స్ : వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారిలో చాలా మంది ఓట్స్​ని రెగ్యులర్​గా తీసుకుంటుంటారు. వీటిలో చక్కెర స్థాయులు తక్కువ ఉండడమే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. అయితే, కొంతమంది మాత్రం ప్రొటీన్స్ కోసం ఓట్స్​, డ్రైఫ్రూట్స్ కలిపి తీసుకుంటుంటారు. ఇలా తీసుకోవడం వల్ల బరువు తగ్గడం అటుంచితే వెయిట్ పెరిగే ఛాన్సే ఎక్కువగా ఉంటుందంటున్నారు న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి. కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్​కు దూరంగా ఉండడం మంచిదంటున్నారు.

అన్నం+ఆలుగడ్డలు : ఇది బరువు తగ్గాలనుకునేవారు కలిపి తీసుకోకూడని మరో ఫుడ్ కాంబినేషన్. ఎందుకంటే బంగాళదుంపల్లో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అన్నంతో కలిపి తీసుకున్నప్పుడు వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుందంటున్నారు. అందుకే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు ఈ రెండింటినీ కలిపి తీసుకోకపోవడమే బెటర్ అంటున్నారు. అయితే, వీటిని విడివిడిగా అదీ తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడే ఆరోగ్యానికి ఎలాంటి హానీ కలగదని సూచిస్తున్నారు.

ఆశ్చర్యం : బరువు తగ్గడానికి బంగాళాదుంపలు! - నిపుణులు చెబుతున్నది ఇదే!

స్నాక్స్‌+డ్రింక్స్ : చాలా మందికి సాయంత్రం కాగానే ఏదో ఒక స్నాక్ తిని టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అదే.. టీ, కాఫీలు అలవాటు లేని వారిలో కొందరు కూల్​డ్రింక్స్ సేవిస్తుంటారు. అయితే, ఈ కాంబినేషన్ కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదని సూచిస్తున్నారు డాక్టర్ లహరి. ఎందుకంటే వీటిలో ఉండే చెడు కొవ్వులు, అధిక చక్కెర స్థాయులు బాడీ వెయిట్​ను మరింత పెంచడంతో పాటు అజీర్తి సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుందంటున్నారు. అందుకే ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు ఈ కాంబినేషన్​కు దూరంగా ఉండడం మేలు అంటున్నారు.

వీటికి దూరంగా ఉండాలి!

ఈ ఫుడ్ కాంబినేషన్స్​కు దూరంగా ఉండడమే కాకుండా మరికొన్ని ఆహారాలను దూరం పెట్టడం ఈజీగా బరువు తగ్గడానికి తోడ్పడుతుందంటున్నారు. వాటిలో ప్రధానంగా జంక్​ఫుడ్, ఆయిల్ ఫుడ్, వేయించిన ఆహారాలు, చక్కెర ఆధికంగా ఉండే ఆహారాలు, పానీయాలు, ట్రాన్స్‌ ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​కి వీలైనంత దూరంగా ఉండడం మంచిదంటున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ సూరపనేని లహరి.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

బరువు తగ్గాలంటే వ్యాయామాలు మాత్రమే కాదు - రోజూ ఇది తిన్నా ఈజీగా వెయిట్ లాస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.