దాదాపు 22 మంది ప్రాణాలు కోల్పోయాక దిద్దుబాటు చర్యలు తీసుకుంటే ఉపయోగం ఉండదని ఫోరం ప్రతినిధులు అన్నారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఈ ఐదేళ్లలో విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పు ఏంటో చెప్పాలంటూ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంటర్మీడియట్ బోర్డులో 5 వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని భర్తీ చేయకుండా బయటి వాళ్ళకు కాంట్రాక్టు ఇవ్వడం వల్లనే వారు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఫోరమ్ అధ్యక్షుడు మురళీ మనోహర్ ఆరోపించారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన ప్రశ్నించారు.
ఇవీ చూడండి: విచారణ కమిటీ నుంచి జస్టిస్ రమణ నిష్క్రమణ