ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వసాధారణమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ ముషీరాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానం నుండి ఎంపీగా గెలిచిన బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్రంలో మోడీ హవాతో భాజపా ఇక్కడ గెలిచిందన్నారు. ఫలితాలపై పార్టీలో సమీక్ష చేసకుంటామని మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. కార్యక్రమంలో తలసాని సాయికిరణ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు..
ఇవీ చూడండి: ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సాధారణం